ఏం అందంరా బాబు..! ఈ చిన్నారిని గుర్తుపట్టారా.? కుర్రాళ్లను కవ్విస్తున్న ఆమె ఎవరంటే
సినీ సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా ఉన్నాయి. నిత్యం వందల సంఖ్యలో సినీ సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. సినిమా వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో షికారు చేస్తూనే ఉంటాయి. సోషల్ మీడియాలో స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు సంబందించిన లేటెస్ట్ ఫోటోల దగ్గర నుంచి చిన్ననాటి ఫోటోల వైరల్ అవుతుంటే ఉన్నాయి.

సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఫోటోలకు కొదవే ఉండదు. నిత్యం నెట్టింట పదుల సంఖ్యలో హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆమె చేసిన సినిమాలు తక్కువే కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం మాములుగా లేదు. తెలుగులో రెండే రెండు సినిమాలు చేసింది. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఆతర్వాత ఈ చిన్నది ఎక్కడా కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అంతే కాదు తన అందాలతో కుర్రకారుకు మెంటలెక్కిస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె అందాలకు ఫిదా అవ్వని కుర్రాడు ఉండడు. ఇంతకూ ఆమె ఎవరు అంటే..
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన దృశ్యం సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. దృశ్యం సినిమా రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో వెంకటేశ్, మీనా జంటగా నటించారు. చాలా కాలం తర్వాత వీరిద్దరి జోడి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించింది అందాల భామ ఎస్తర్ అనిల్. పై ఫొటోలో ఉన్నది ఆ అమ్మడే..
ప్రస్తుతం మలయాళంలో హీరోయిన్ గా నటిస్తుంది. అప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాదు నిత్యం లేటేస్ట్ క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అందాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది ఎస్తర్. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తూ వావ్ అనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు కుర్రకారును కవ్విస్తున్నాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




