Mirchi Madhavi : నా కోసం ఆ డైరెక్టర్ ఇంటికొచ్చేసాడు.. చెప్పుతో కొడుతా అని.. మిర్చి మాధవి కామెంట్స్..

గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది మిర్చి మాధవి. ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో భాగ్యం పాత్రలో అలరిస్తుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Mirchi Madhavi : నా కోసం ఆ డైరెక్టర్ ఇంటికొచ్చేసాడు.. చెప్పుతో కొడుతా అని.. మిర్చి మాధవి కామెంట్స్..
Mirchi Madhavi News

Updated on: May 31, 2026 | 1:36 PM

సీరియల్ మిర్చి మాధవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి పంచుకున్నారు. తన సినీ జీవితం ప్రారంభంలో ఎదురైన ఒక వ్యక్తిగత చేదు అనుభవాన్ని మాధవి వివరించారు. ఒకప్పుడు తాను అమాయకురాలిగా, ఇన్నోసెంట్‌గా ఉండేదాన్నని తెలిపారు. ఒకసారి, దిల్సుఖ్ నగర్‌లోని తన ఇంటికి ఒక వ్యక్తి దర్శకుడని చెప్పుకుంటూ వచ్చాడని, ఆ సమయంలో తన తల్లి, ఇంట్లో పని చేసే అమ్మాయి ఉన్నారని చెప్పారు. సినిమా అవకాశాల కోసం వచ్చిన ఆ వ్యక్తి, తాను మామూలు కాటన్ చీర కట్టుకున్నప్పుడు, దాన్ని మార్చి “ఫాలీ” (సింథటిక్) చీర కట్టుకోమని అడిగాడని తెలిపారు. అప్పుడు వెంటనే తనకు ఆ వ్యక్తి ఉద్దేశం అర్థమైందని, అతన్ని “దొంగనా కొడుకు” అని తిట్టి, చెప్పు తీసుకొని కొడతాను బయటికి వెళ్ళమని గట్టిగా చెప్పానని మాధవి వెల్లడించారు. ఆ సమయంలో షాక్‌కి గురైనా, తలుపులు లాక్ చేసి ముగ్గురు ఆడవాళ్లం ఉన్నప్పుడు ఏమి జరిగేదో అని తర్వాత భయపడినట్లు తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

ఆ ఘటన తర్వాత తన తల్లి, అప్పట్లో ఫిర్యాదు చేస్తే ప్రయాస అవుతుందని భావించి, దానిని వదిలేయమని చెప్పినట్లు మాధవి గుర్తు చేసుకున్నారు. తప్పు జరిగినప్పుడు తాను ఖచ్చితంగా ప్రశ్నిస్తానని, తన హక్కుల కోసం 100% నిలబడతానని ఆమె తేల్చి చెప్పారు. తనను తాను “బ్లడీ ఫూల్” అని తిట్టుకుంటూ స్వీయ విశ్లేషణ చేసుకుంటానని, లేకపోతే నార్సిసిస్ట్ అవుతామని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరినీ ఉద్ధరించనని, డబ్బులు చెల్లిస్తేనే శిక్షణ ఇస్తానని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. పరిశ్రమలో తన విషయంలో ఏదైనా తేడా వస్తే అసలు ఊరుకోనని, ధైర్యంగా ఎదుర్కొంటానని “ఫైర్ బ్రాండ్”గా తన పేరుకు తగ్గట్టే మాధవి స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

మిర్చి మాధవి తెలుగు బుల్లితెరపై, వెండితెరపై పలు సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా బుల్లితెరపై యాంకర్‌గా, రేడియోలో ఆర్‌జేగా ఆమె మాట్లాడే యాస, గొంతు ప్రేక్షకులకు బాగా సుపరిచితం. హైదరాబాద్‌లోని ప్రముఖ రేడియో స్టేషన్ ‘రేడియో మిర్చి’ లో ఆమె చాలా కాలం పాటు ఆర్‌జేగా పనిచేశారు. అక్కడ ఆమె నిర్వహించిన షోలు, ఆమె మాట్లాడే విలక్షణమైన శైలి శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రేడియో మిర్చి ద్వారానే ఆమె పేరు కాస్తా ‘మిర్చి మాధవి’గా స్థిరపడిపోయింది. రేడియోలో సక్సెస్ అయిన తర్వాత ఆమె బుల్లితెరపైకి అడుగుపెట్టారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

Follow Us