Actress: 30 ఏళ్ల తర్వాత ఇండియాకు తిరిగొచ్చిన ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్.. రీఎంట్రీకి రెడీ.. ఎవరో గుర్తు పట్టారా?

హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయిందీ అందాల తార. సుమారు 30 ఏళ్లుగా అక్కడే నివాసుముంది. అయటే ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ ఇండియాలోకి అడుగు పెట్టింది. త్వరలోనే సినిమాల్లో కూడా రీ ఎంట్రీ ఇస్తానంటోంది.

Actress: 30 ఏళ్ల తర్వాత ఇండియాకు తిరిగొచ్చిన ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్.. రీఎంట్రీకి రెడీ.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress

Updated on: May 26, 2026 | 3:39 PM

గతంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన వారందరూ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సెకెండ్ ఇన్నింగ్స్ అంటూ సహాయక నటి పాత్రలు పోషిస్తున్నారు. హీరోలు, హీరోయిన్లకు అక్కగా, అమ్మగా, అత్తమ్మ గా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇప్పటికే లయ, అన్షు వంటి తెలుగు హీరోయిన్లు సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ చేరింది. గతంలో పలు తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించిందీ అందాల తార. ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి తదితర స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గానూ నటించి మెప్పించింది. అయితే చాలా మంది హీరోయిన్లలాగే పెళ్లయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయింది. భర్తతో పాటే అమెరికా వెళ్లిపోయింది. అక్కడ పిల్లలకు డ్యాన్స్ పాఠాలు చెబూతూ లైఫ్ లీడ్ చేసింది. సుమారు 30 ఏళ్లుగా అమెరికాలోనే నివాసుమంటోన్న ఈ అందాల తార సడెన్ గా ఇండియాలో వాలిపోయింది. అంతేకాదు ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. పై ఫొటోలో ఉన్నది ఆ హీరోయినే. మరి ఆమె ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉంద కదా.. అయితే సమాధానం కూడా మేమే చెబుతాం లెండి. ఆమె మరెవరో కాదు ఆపద్భాంధవుడు హీరోయిన్ మీనాక్షి శేషాద్రి

1995లో వ్యాపారవేత్త హరీష్ మైసూర్‌ను వివాహం చేసుకుంది మీనాక్షి. ఆ తర్వాత భర్తతో కలిసి అమెరికాకు వెళ్లిపోయింది. అప్పటికీ ఆమె హిందీ చిత్రసీమలో అగ్ర కథానాయికగా వెలుగొందుతోంది. అయినా అన్నిటినీ విడచి పెట్టి యూఎస్ వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ కి రెడీ అంటోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఓటీటీ షోల ద్వారా తన నటనా ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది మీనాక్షి.

ఇవి కూడా చదవండి

మీనాక్షి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

‘నన్ను అభిమానిస్తున్న అందరికీ, మీరు అందిస్తున్న సపోర్ట్‌కు థాంక్స్. 30 ఏళ్ల తర్వాత మళ్లీ నా కర్మభూమికి తిరిగి వచ్చేశాను. ఎంతో నమ్మకం, ఉత్సాహం, పాజిటివిటీతో ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలోకి మళ్లీ అడుగుపెడుతున్నాను. చిన్న, పెద్ద, లీడ్ రోల్ అనే తేడా లేకుండా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా. సినిమాలతో పాటు ఓటీటీ షోలు, వెబ్ సిరీస్‌లు కూడా చేసేందుకు రెడీగా ఉన్నా. నాకు ఛాలెంజింగ్ అనిపించే రోల్స్ చేయాలని ఉంది. ఇండియాకు వచ్చిన తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. అంత ఎగ్జైటింగ్‌గా లేవు. నేను ఏదో నిరూపించుకోవడానికి రీ ఎంట్రీ ఇవ్వడం లేదు. నా ఫ్యామిలీ మెంబర్స్ ప్రోత్సాహం వల్లే ఇక్కడున్నా. అందుకే మళ్లీ సినిమా ఇండస్ట్రీలో భాగం కావాలని కోరుకుంటున్నా’ అని మీనాక్షి చెప్పుకొచ్చింది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us