
క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ పర్వదినాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు క్రిస్మస్ లంచ్ పార్టీలు ఇచ్చారు. అనంతరం తమ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ నటి మీనా తన కూతురితో కలిసి క్రిస్మస్ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ఎందుకంటే ఈ ఫొటోల్లో మీనా కూతురు నైనిక స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తోంది. . క్యూట్ గా ఉండే అమ్మాయి.. అప్పుడే అంత పెద్దగా ఎదిగిందా.. ఇంతందంగా మారిపోయింది అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
ఐదేళ్ల వయసులోనే ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నైనిక. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించి తేరీ సినిమాలో హీరో కూతురిగా నటించింది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ సినిమా తర్వాత మరే మూవీలోనూ కనిపించలేదీ స్టార్ కిడ్. యాక్టింగ్ కు బ్రేక్ ఇచ్చి చదువుపై ఫుల్ ఫోకస్ పెట్టింది.
#Christmas2025 #ChristmasDay #Meena #ActressMeena pic.twitter.com/kheBmNLBzS
— Actor Kayal Devaraj (@kayaldevaraj) December 25, 2025
కాగా మీనా బెంగగళూరుకు చెదిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. 2009లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. 2011లో ఈ దంపతులకు నైనిక జన్మించింది. ప్రస్తుతం నైనిక వయసు సుమారు 14 ఏళ్లు. ప్రస్తుతం ఉన్నత చదువులు అభ్యసిస్తోంది. కాగా కొన్నాళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సింగిల్ మదర్ గా నైనికను కంటికి రెప్పలా చూసుకుంటోంది మీనా.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది మీనా. ప్రస్తుతం సహాయక నటిగా మెప్పిస్తోందీ అందాల తార. తెలుగుతో పాటు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.