Viral Photo: క్యూట్‏నెస్ ఓవర్‏లోడేడ్.. నవ్వుతోనే అట్రాక్ట్ చేస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. యూత్‏లో యమ క్రేజ్..

క్యూట్‏నెస్ ఓవర్ లోడేడ్.. చిలిపి కళ్లు.. నవ్వుతోనే అట్రాక్ట్ చేస్తూ ఫోటోకు ఫోజిచ్చిన చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ? మొదటి సినిమాతోనే తెలుగులో సూపర్ హిట్

Viral Photo: క్యూట్‏నెస్ ఓవర్‏లోడేడ్.. నవ్వుతోనే అట్రాక్ట్ చేస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. యూత్‏లో యమ క్రేజ్..
Viral

Updated on: Mar 10, 2022 | 8:57 PM

క్యూట్‏నెస్ ఓవర్ లోడేడ్.. చిలిపి కళ్లు.. నవ్వుతోనే అట్రాక్ట్ చేస్తూ ఫోటోకు ఫోజిచ్చిన చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ? మొదటి సినిమాతోనే తెలుగులో సూపర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుని క్రేజీ హీరోయిన్ గా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఎవరో గుర్తుపట్టండి..

ఆ చిన్నారి ఎవరో కాదండోయ్.. క్రేజీ హీరోయిన్ మాళవిక మోహనన్. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమైంది ఈ అమ్మడు. ఆ తర్వాత తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి.. డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో మాళవికా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో ధనుష్ సరసన మారన్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెల 11న విడుదల కానుంది. తాజాగా మాళవిక మోహనన్ చిన్ననాటి ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

Also Read: Sitara Gattamaneni: సితారలో ఈ టాలెంట్ కూడా ఉందా ?.. ఏకంగా బుర్జ్ ఖలీఫానే..

Rashmi Gautham: క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన రష్మి.. తేలికగా ఆ మాటలు అనేస్తుంటారు అంటూ..

Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాను అందుకే తొందరగా రిలీజ్ చేశారా ?.. క్లారిటీ ఇదేనా…

ET Movie Review: నారీలోకానికి అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన ఈటీ!..