కీర్తి సురేష్.. తెలుగులో మంచి ఫాంలో ఉన్న హీరోయిన్స్‌లలో ఒకరు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్ రేసులో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం మహేష్ సరనస సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న భోళా శంకర్ మూవీలో చిరు చెల్లెలి పాత్రలో కనిపించనుంది. ఇక చేతినిండా సినిమాలతో బిజీగా గడిపేస్తున్న కీర్తి సురేష్.. ఇటీవల సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది..నిత్యం తన వ్యక్తిగత విషయాలు.. సినిమా అప్డేట్స్ షేర్ చేస్తూ.. నెట్టింట్లో హల్చల్ చేస్తోంది కీర్తి. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన లెటేస్ట్ ఫోటోలను షేర్ చేసింది. మై మండే బ్లూస్ అంటూ షేర్ చేసిన ఫోటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఇన్‌స్టా పోస్ట్..
ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి.. కాస్త విరామం దొరికితే చాలు కుటుంబంతో కలిసి గడిపేస్తుందన్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా కీర్తి..తన స్నేహితులైన సమంత.. త్రిషలతో ఈ వీకెండ్ ఎంజాయ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. అందులో సమంత.. కీర్తి సురేష్.. త్రిష.. కళ్యాణి ప్రియదర్శన్.. ప్రీతం జుకల్కర్ కలిసి గులాభీలు పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇవి ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇన్‌స్టా పోస్ట్..
ఇక సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే త్రిష..ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్ సినిమాలో నటిస్తుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ కీలక పాత్రలో కనిపించనుంది.
Also Read: Bheemla Nayak: భీమ్లా నాయక్ అప్డేట్ వచ్చేసింది.. ధర్మేంద్ర అంటూ రానా వార్నింగ్..
సినీ పెద్దలతో మంత్రి పేర్ని నాని సమావేశం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిర్మాతలు..