పైన ఫోటోలో ఉన్న సోయగాల చిన్నది తెలుగు చిత్ర పరిశ్రమలోనే క్రేజీ హీరోయిన్. అచ్చ తెనుగు ఆడపిల్లగా కనిపిస్తూ.. అందం, అభినయంతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం గ్లామరస్ పాత్రలే కాకుండా.. కంటెంట్ ప్రాధాన్యత ఉంటే డీగ్లామరస్ పాత్రలు చేసి మెప్పించింది ఈ చిన్నది. ఎవరో గుర్తుపట్టండి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ఈ అమ్మడు ఎప్పుడూ ముద్దుంటుంది. ఎవరో గుర్తుపట్టగలరా ?.. మీకోసం చిన్న క్లూ.. ఈ హీరోయిన్ నటించిన సినిమాలోని ఒక ఫేమస్ డైలాగ్.. “ ప్రేమించిన వాడి కోసం అందర్నీ వదులుకున్నాను.. ప్రేమ కోసం ప్రేమించినవాడిని కూడా వదులుకున్నాను.. “ గుర్తుపట్టారా ? ఈ డైలాగ్ ఏ సినిమాలో అనేది తెలిస్తే ఆ హీరోయిన్ ఎవరో కూడా తెలిసిపోతుండోయ్..
ఫోటోలో ఉన్న అందాల చిన్నది మరెవరో కాదండోయ్.. హీరోయిన్ కీర్తి సురేష్.. నేను శైలజ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన సర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ సరికొత్త కనిపించారు.