నటి కరాటే కళ్యాణిపై దాడి.. చేసింది ఎవరు.? కారణం ఏంటంటే

నటి  కరాటే కళ్యాణి పై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె పై దాడి చేశారు. ఇటీవలే ఆమె టీటీడీ లక్కీ డ్రా పేరుతో కొందరు యువకులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. దాంతో ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారి తీసింది.

నటి కరాటే కళ్యాణిపై దాడి.. చేసింది ఎవరు.? కారణం ఏంటంటే
Karate Kalyani

Updated on: Jan 20, 2026 | 8:53 PM

నటి  కరాటే కళ్యాణి పై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె పై దాడి చేశారు. ఇటీవలే ఆమె టీటీడీ లక్కీ డ్రా పేరుతో కొందరు యువకులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. దాంతో ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ మోసాన్ని అడ్డుకునే  క్రమంలోనే కరాటే కళ్యాణి పై దాడి జరిగిందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు.. ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొంతం మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు లక్కీ డ్రా పేరుతో.. కేవలం రూ.399 డబ్బులు కడితే ఫార్చ్యూనర్ కారు, ఐఫోన్, టీవీ, బైక్ లాంటి  బహుమతులు వస్తాయని నమ్మించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఈ క్రమంలోనే ఆమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు కరాటే కళ్యాణి ప్రయతించగా ఈ క్రమంలోనే ఆమె పై దాడి జరిగిందని తెలుస్తుంది. కరాటే కళ్యాణితో పాటు ఆమె కొడుకుపై కూడా దాడి జరిగిందని తెలుస్తుంది. ఈ గొడవకు జరిగిన దాడిని ఆమె సోషల్ మీడియాలో లైవ్ పెట్టారు.