
పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికలలో శ్రీదేవి ఒకరు. అప్పట్లో చిత్రపరిశ్రమలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న తార కూడా ఆమెనే. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆపై కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. 2018 ఫిబ్రవరి 24న 54 ఏళ్ల వయసులోనే అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. శ్రీదేవి మరణం సినీ పరిశ్రమకు ఎప్పటికీ తీరని లోటును మిగిల్చింది. శ్రీదేవి ఎంతో మంది హీరోలతో కలిసి సినిమాలు చేశారు. అలాగే ఆమె కొంతమంది హీరోయిన్స్ కాంబినేషన్ లోనూ నటించారు. అయితే శ్రీదేవి ఉంటే నేను సినిమా చేయను అని చెప్పిన నటి ఎవరో తెలుసా.? శ్రీదేవిని హీరోయిన్ గా పెట్టి నాకు చిన్న పాత్ర ఇస్తారా..? నేను సినిమా చేయను అని తెగేసి చెప్పిందట ఆ హీరోయిన్. ఇంతకూ ఆమె ఎవరంటే..
ఆమె మరెవరో కాదు.. తన సహజమైన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటి జయసుధ. తెలుగు సినిమాల్లో అమ్మ పాత్ర అంటే టక్కున గుర్తుకువచ్చే పేరు ఆమెది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఎంతో మంది స్టార్ హీరోలకు అమ్మగా నటించి ఆకట్టుకున్నారు. ఎలాంటి హావభావాలనైనా అలవోకగా పలికించగల నటి ఆమె.. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు జయసుధ. సినిమాలతో పాటు జయసుధ పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఈక్రమంలోనే ఆమె మాట్లాడుతూ..
అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమాభిషేకం చిత్రంలో ఒక వేశ్య పాత్రను పోషించడానికి నేను ముందుగా ఆలోచించాను, సినిమా చేయను అని చెప్పా అని తెలిపారు. శ్రీదేవి లాంటి హీరోయిన్ ఉన్న సినిమాలో నాకు చిన్న పాత్ర ఇవ్వడం గురించి చాలా ఆలోచించా.. ఆ సినిమాలో నా రోల్, టైం కాదు శ్రీదేవినే ప్రాబ్లమ్.. దర్శకుడు దాసరి నారాయణరావు వంటి బలమైన వ్యక్తిత్వం ఉన్న మెంటర్ ప్రోత్సాహంతో, శ్రీదేవి కాదు, ఎవరూ కనిపించరు, నీకే పేరు వస్తుంది అని చెప్పిన ఆయన మాటలు నమ్మి జయసుధ ఆ పాత్రను చేశారట. దాసరి నారాయణరావు సూచన మేరకు, ఆ పాత్రకు ఎటువంటి మేకప్ లేకుండా, కేవలం పసుపు మాత్రమే ముఖానికి రాసుకుని నటించారట జయసుధ. ఆ సినిమాలో శ్రీదేవి గ్లామరస్ గా కనిపించినా, జయసుధ డీగ్లామరైజ్డ్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కట్ చేస్తే సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. జయసుధకు మంచి పేరు వచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.