Silk Smitha: అతన్ని గుడ్డిగా నమ్మింది.. అందువల్లే సిల్క్ స్మిత బలైంది.. ఎవరు చెప్పారంటే

తమిళ్ ఇండస్ట్రీలో వండి చక్రం అనే సినిమాద్వారా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ సినిమాలో ఆమె పేరు సిల్క్.. దాంతో స్మిత కాస్త సిల్క్ స్మిత అయ్యింది. స్మిత ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించింది స్మిత. సీతాకోక చిలుక సినిమాలో సిల్క్ స్మిత పోషించిన పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Silk Smitha: అతన్ని గుడ్డిగా నమ్మింది.. అందువల్లే సిల్క్ స్మిత బలైంది.. ఎవరు చెప్పారంటే
Silk Smitha
Follow us

|

Updated on: Mar 19, 2024 | 12:59 PM

ఒకప్పుడు కుర్రకారును ఊపు ఊపేసిన నటీమణుల్లో సిల్క్ స్మిత ఒకరు. స్పెషల్ సాంగ్ కు సిల్క్ స్మిత పెట్టింది పేరు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలలో 200లకు పైగా సినిమాలలో నటించింది. తమిళ్ ఇండస్ట్రీలో వండి చక్రం అనే సినిమాద్వారా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ సినిమాలో ఆమె పేరు సిల్క్.. దాంతో స్మిత కాస్త సిల్క్ స్మిత అయ్యింది. స్మిత ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించింది స్మిత. సీతాకోక చిలుక సినిమాలో సిల్క్ స్మిత పోషించిన పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. “వసంత కోకిల”  సినిమాలోనూ అద్భుతంగా నటించింది. ఇక ఈ అమ్మడు చేసిన స్పెషల్ సాంగ్స్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా బావాలు సయ్యా సాంగ్ అయితే ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కెరీర్ లు దూసుకుపోతున్న సిల్క్ స్మిత ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకొని కన్నుమూశారు. డిప్రషన్ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నారని అందరూ అంటున్నారు. అయితే తాజాగా నటి జయమాలిని సిల్క్ స్మిత మరణం గురించి మాట్లాడారు. సిల్క్ లానే జయమాలిని కూడా స్పెషల్ సాంగ్స్, వ్యాంప్ పాత్రలతో మెప్పించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ..

తక్కువ సమయంలోనే పేరు, డబ్బు, పాపులారిటీ సొంతం చేసుకుంది సిల్క్ స్మిత. షూటింగ్స్ లో మేము పెద్దగా మాట్లాడుకోము.. మేము ఎక్కువగా కలిసి పని చేయలేదు. కానీ ఓ పెద్ద హీరో సినిమాలో నేను, మా అక్క జ్యోతిలక్ష్మి, సిల్క్‌ స్మిత కలిసి నటించాం.. కానీ కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండకూడదు. ఆమె చేసిన పెద్ద తప్పు అదే.. కన్నవారిని వదిలిపెట్టి ఉండకూడదు. ప్రేమించడం తప్పుకాదు.. కానీ కన్నవారు పక్కన ఉండాల్సింది. ప్రేమించిన వాడిని గుడ్డిగా నమ్మింది. అతను మోసం చేశాడు. అయినవారు పక్కన లేకపోతే మోసం చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు అలానే సిల్క్ స్మిత బలైంది అని అన్నారు జయమాలిని.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో