Jayalalitha: ఆ హీరో నాకోసం ప్రత్యేకంగా వైన్ బాటిల్ తెచ్చేవారు.. ఆయన చనిపోయేటప్పుడూ నేను పక్కనే ఉన్నా

ప్రముఖ తెలుగు నటి జయలలిత తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇదే క్రమంలో తండ్రి సమానుడైన ఓ హీరోతో తనకు సంబంధం అంటగట్టారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Jayalalitha: ఆ హీరో నాకోసం ప్రత్యేకంగా వైన్ బాటిల్ తెచ్చేవారు.. ఆయన చనిపోయేటప్పుడూ నేను పక్కనే ఉన్నా
Actress Jayalalitha

Updated on: Sep 25, 2026 | 9:44 PM

ప్రముఖ నటి జయలలిత గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సహాయక నటిగా మారిపోయింది. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి మెప్పించారామె. అయితే ఎక్కువగా వ్యాంప్ పాత్రలకే పరిమితమైన ఆమెను అభిమానులు ముద్దుగా బోరింగ్ పాప అని పిలుస్తుంటారు. లారీ డ్రైవర్, ముఠా మేస్త్రి, గ్యాంగ్ లీడర్ తదితర సినిమాల్లో నెగెటివ్ పాత్రల్లోనూ నటించి బాగా ఫేమస్ అయ్యారు జయలలిత. కేవలం సినిమాలు మాత్రమే కాదు సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారీ అందాల తార. అయితే ఇప్పుడు ఆమె సినిమాలకు, సీరియల్స్‌కు పూర్తిగా గుడ్ బై చెప్పి కెమెరాకు దూరంగా ఉంటున్నారు. కాగా సినిమాలు, టీవీ సీరియల్స్ సంగతి పక్కన పెడితే జయలలిత వ్యక్తిగత జీవితంలో సినిమాలకు మించి ట్విస్టులున్నాయి. పురుషాధిక్యం కనిపించే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఆమెను వాడుకుని వదిలేశారని స్వయంగా జయలలిత పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరైన జయలలిత తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇదే క్రమంలో తండ్రి సమానుడైన ఓ హీరోతో తనకు సంబంధం అంటగట్టారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పట్లో తనను, సీనియర్ నటుడు గుమ్మడిని కలుపుతూ సినిమా ఇండస్ట్రీలో అనేక పుకార్లు షికార్లు చేశాయని, అవి తనను ఎంతగానో బాధించాయని జయలలిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘గుమ్మడి గారు నాకు తండ్రితో సమానం. మా మధ్య ఉన్న పవిత్రమైన బంధాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అవాస్తవాలు సృష్టించి తప్పుడు సంబంధం అంటగట్టారు. ఆయన ప్రతిరోజూ ఉదయాన్నే నాకు ఫోన్ చేసి, ఏం వండుతున్నావ్? అని ఎంతో ఆప్యాయంగా అడిగేవారు. మేమంతా కలిసి భోజనం చేసేవాళ్లం, సరదాగా పేకాట ఆడేవాళ్లం. అదంతా నా అదృష్టంగా భావించేదాన్ని. నా కోసం ఆయన ప్రత్యేకంగా ఓ వైన్ బాటిల్ కూడా తెప్పించేవారు. నాకు పరిచయమైన తర్వాత ఆయన బయట క్లబ్‌కు వెళ్లడం కూడా పూర్తిగా మానేశారు. గుమ్ముడితో నా ప్రయాణం నాలుగేళ్ల పాటు కొనసాగింది. ఆయన చివరి రోజుల్లో కూడా నేను దగ్గరుండి చూసుకున్నా. గుమ్మడి గారి ఆరోగ్యం క్షీణించినప్పుడు నేనే స్వయంగా ఆయనను ఆస్పత్రిలో చేర్పించాను. ఆయన తుదిశ్వాస విడిచే సమయంలో కూడా నేనే పక్కనే ఉన్నాను. గుమ్మడి గారు చనిపోయిన తర్వాత దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు నాతో మాట్లాడుతూ.. ‘గుమ్మడి గారు చనిపోవడం నీకు చాలా పెద్ద మైనస్’ అని నాతో చెప్పారు. ఆయనతో కలిసున్న ఆ రోజులు మళ్లీ తిరిగి రావు. ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఆయన ఇంటి వైపు వెళ్తుంటే ఆ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఏడుపు వస్తుంది’ అని అంటున్నారు జయలలిత. ప్రస్తుతం ఈ సీనియర్ నటి కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us