ఆమె అందాన్ని చూస్తే దేవకన్యలకే ఈర్ష్య వస్తుంది. చిలిపి నవ్వులతో కుర్రకారును మాయ చేస్తుంది. చురకత్తుల్లాంటి చూపులతో గుండెల్లో బాణాలు దించుతుంది. ఆమె తన సినీ కెరీర్‌లో చేసింది కేవలం 6 చిత్రాలే అయినా.. తిరుగులేని స్టార్‌డమ్‌ను సంపాదించింది. అతిలోక సుందరి కూతురు ఈ అందాల అమ్మడు.. ఎవరో గుర్తుపట్టారా.? ఈమె బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్.. ప్రస్తుతం తెలుగులోకి ఓ స్టార్ హీరో సరసన నటించబోతోంది. ఇప్పటికైనా ఆమెవరో మీరు కనిపెట్టేసుండాలి. క్వశ్చన్‌లోనే ఆన్సర్ కూడా ఇచ్చేశాం బాసూ..! ఇంకా గుర్తుపట్టలేదా..!!
ఆమెవరో కాదు.. జాన్వి కపూర్. అతిలోక సుందరి శ్రీదేవి కూతురైన జాన్వి.. బాలీవుడ్‌లోకి ‘ధడక్’ సినిమాతో అరంగేట్రం చేసింది. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని ఓవర్‌నైట్‌లోనే తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘గుంజన్ సక్సేనా’, ‘రూహీ’, ‘గుడ్ లక్ జెర్రీ’, ‘మిలి’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాలు, తెలుగులో ‘ఎన్టీఆర్30’లో హీరోయిన్‌గా నటిస్తోంది.