తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ఇలియాన సుపరిచితమే. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఒకప్పుడు వరుస చిత్రాలతో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. దక్షిణాదిలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగమ్మ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే కొన్ని రోజులు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయిన ఆమె.. ఇప్పుడిప్పుడే నెట్టింట తిరిగి యాక్టివ్ అయ్యారు. అయితే ఆమె తమిళంలో ఆమె సినిమా చేసి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. దీంతో ఇలియానను కోలీవుడ్ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే ప్రచారం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఈ వార్తలు ఫిల్మ్ సర్కిల్లో తెగ వైరలవుతున్నాయి.
గతంలో తమిళంలో ఓ సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ మూవీ ప్రొడ్యూసర్ నుంచి భారీ మొత్తంలో అడ్వాన్స్ తీసుకున్నారట. అయితే అనివార్య కారణాలతో ఆ సినిమా చిత్రీకరణ స్టార్ట్ కాకముందే ప్రాజెక్ట్ ఆగిపోయిందట. దీంతో సదరు నిర్మాతకు భారీ నష్టం వచ్చిందట. తనకు న్యాయం చేయాలంటూ ఆయన తమిళ చలనచిత్ర నిర్మాతల మండలిని ఆశ్రయించారట. ఆయన ఫిర్యాదును పరిశీలించిన నిర్మాతల మండలి.. ఇలియానను తిరిగి డబ్బులు చెల్లించాలని కోరగా.. అందుకు ఆమె అంగీకరించలేదట. ఆ డబ్బు మాత్రం తిరిగి ఇవ్వను అని చెప్పిందట. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తన గురించి వస్తున్న ఈ వార్తలపై ఇప్పటివరకు ఇలియానా స్పందించలేదు. ఇలియాన చివరిసారిగా ది బిగగ్ బుల్ చిత్రంలో కనిపించింది. ఇటీవల తాను అనారోగ్యానికి గురైనట్లుగా సోషల్ మీడియాలో అభిమానులకు తెలిపింది ఇలియాన. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోస్ నెట్టింట షేర్ చేసింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కామెంట్స్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.