Hema : కర్మ వదిలిపెట్టదు.. ఇంతకు ఇంత అనుభవిస్తావు.. అనసూయ కామెంట్స్ పై హేమ రియాక్షన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి హేమ. సినిమాలే కాకుండా బిగ్ బాస్ షో ద్వారా మరింత పారులర్ అయ్యింది. అటు సినిమాలతోపాటు ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సమాజంలో జరిగే కొన్ని విషయాలపై రియాక్ట్ అవుతుంటారు. తాజాగా అనుసూయ కామెంట్స్ పై రియాక్ట్ అయ్యింది నటి హేమ. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది.

Hema : కర్మ వదిలిపెట్టదు.. ఇంతకు ఇంత అనుభవిస్తావు.. అనసూయ కామెంట్స్ పై హేమ రియాక్షన్..
Hema, Anasuya

Updated on: Aug 21, 2026 | 8:56 PM

టాలీవుడ్ నటి అనసూయ ఇటీవల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. జై శ్రీరామ్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అనసూయ హిందూ ధర్మాన్ని అవమానించారంటూ విమర్శలు చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదరడంతో ఆమె తన ఇన్ స్టా వేదికగా స్పందించారు. తన మాటలను కొందరు కావాలని వక్రీకరిస్తున్నారని..తనపై కావాలనే నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారని మండిపడజ్డారు. తాను ఎవరిని కించపరచలేదని.. కేవలం కొందరి గురించి మాత్రమే చెప్పానని అన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్స్ చేసే వారి గురించి మాట్లాడనని వివరణ ఇచ్చారు. తాజాగా అనసూయ చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ నటి హేమ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను తన ఇన్ స్టాలో రిలీజ్ చేశారు.

హేమ మాట్లాడుతూ.. “హాయ్ అనసూయ. మనమందరం అద్దాల మేడలో బతుకుతున్నాం. మనం మాట్లాడే ప్రతి మాట.. మనం చేసే ప్రతి పనిని భూతద్దంలో చూస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా. ఈ విషయం నీకు తెలియనిది కాదు. ఎందుకు అప్పుడప్పుడు స్లిప్ అవుతుంటావు. నీ వ్యక్తిగతం నీ ఇష్టం. నీ ధర్మం కూడా నీ ఇష్టం. కోట్ల ప్రజల విశ్వాసాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడే మాటలకు, చేసే పనులకు మధ్య తేడా ఉంటే వెంటనే పసిగట్టేస్తారు. జై శ్రీరామ్ అనేది. స్లోగన్ కాదు. కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయే ఒక మంత్రం. జై శ్రీరామ్ అనేది ఒక పవర్. నువ్వు ఎవరివో.. నువ్వు ఎవరినైనా అనాలి అనుకున్నప్పుడు వారిని సూటిగా ప్రశ్నించి… అంతేగానీ దేవుడి ఫోటోస్ పెట్టుకుని, జై శ్రీరామ్ అని ఆ ముసుగులో ఒక వర్డ్ యూస్ చేశావు. అది నాకు అనాలనిపించడం లేదు. ఇది కరెక్ట్ కాదు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం కరెక్ట్ కాదు.

ఫస్ట్ వీడియో ఏదో పెట్టావు. సెకండ్ వీడియోలో నేను అందరిని అనలేదు. ఎవరో గురించో మాట్లాడుతున్నాను అన్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్లు ఎవరో నువ్వు క్లారిటీగా మాట్లాడు. అంతేకానీ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే మాత్రం ఇంతకు ఇంత అనుభవిస్తావు. కర్మ రిటర్న్స్. అది నేను బాగా నమ్ముతాను. నా చుట్టు ఉన్నవాళ్లకు కూడా తెలుసు నేనెప్పుడు ఇదే చెప్తాను. మనం ఒకరి గురించి మాట్లాడితే కర్మ పదింతలు మనకు వస్తుందని చెప్తాను. సో.. నీ విషయంలో కూడా అదే జరుగుతుంది. జాగ్రత్త. భగవంతుడు నీకు చాలా ఇచ్చాడు. తెలుగు ఇండస్ట్రీ నీకు చాలా ఇచ్చింది. తెలుగు అభిమానులు నిన్ను అందలం ఎక్కించారు. దయచేసి వాళ్ల గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో. థాంక్యూ” అంటూ చెప్పుకొచ్చింది.

ఎక్కువమంది చదివినవి : Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

హేమ వీడియో..

ఎక్కువమంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది..

Loading...
Unable to load recommendations.
Follow Us