
మాస్ మాహారాజా రవితేజ (Raviteja).. డైరెక్టర్ వంశీ కాంబోలో రాబోతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageshwar). రవితేజ కెరీర్లో మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ క్రమంలో ఉగాది (ఏప్రిల్ 2న) మాదాపూర్ లోని నోవాటెల్లో (హెచ్ఐసిసిలో) టైగర్ నాగేశ్వరరావు చిత్ర ప్రధాన బృందం సమక్షంలో గ్రాండ్ లాంఛింగ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఉగాది నాడు మధ్యాహ్నం 12:06 గంటలకు సినిమా ప్రీ లుక్ ని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో వరుసగా ఈ మూవీ నుంచి అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.
ఇప్పటికే ఈ మూవీలో రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్ నటిస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. తాజాగా మరో హీరోయిన్ ఉందంటూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్గా నటించనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్న ఈ సినిమాలో ప్పుడూ చేయని పాత్రలో రవితేజ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ పోస్టర్ భారీ రెస్పాన్స్ సంపాదించి ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచింది. జీవి ప్రకాష్ కుమార్ తన సంగీతంతో అలరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Also Read: Darja Teaser: దర్జా టీజర్ రిలీజ్.. చీరకట్టిన సివంగిగా మరోసారి అదరగొట్టిన అనసూయ..
Nagarjuna: శరవేగంగా ది ఘోస్ట్.. దుబాయ్లో కీలక షెడ్యూల్ పూర్తి చేసిన నాగార్జున అండ్ టీం..
Swimming Benefits: స్విమ్మింగ్ చేస్తే బరువు తగ్గుతారా ?.. ఈ టిప్స్ ఫాలో అయితే ఖాయమంటున్న నిపుణులు..