Chandini Chowdary: లేడీ కానిస్టేబుల్స్‌పై కోపంతో ఊగిపోయిన చాందిని చౌదరి.. ఏమైందంటే

|

Jan 22, 2023 | 3:40 PM

ఆశ్చర్యకరంగా.. ఆ మార్గంలో వెళ్తున్న చాలా మంది ప్రజలు వృద్ధుడిని మహిళా పోలీసులు కొడుతుంటూ చూస్తూ వెళ్లిపోయారే తప్ప, ఆపడానికి ఎవరూ సాహసించలేదు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు చాందని చౌదరి.

Chandini Chowdary: లేడీ కానిస్టేబుల్స్‌పై  కోపంతో ఊగిపోయిన చాందిని చౌదరి.. ఏమైందంటే
Chandini Chowdary
Follow us on

చాందిని చౌదరి.. మన తెలుగమ్మాయ్. కుందనపు బొమ్మలా ఉంటుంది. గతంలో ఎన్నో మంచి.. మంచి షార్ట్ ఫిల్మ్స్ చేసింది. కలర్ ఫోటో సినిమాతో టాలీవుడ్‌లోనూ సత్తా చాటింది. మొన్నామధ్య వచ్చిన సమ్మతమే సినిమాలోనూ నటించి ఆకట్టుకుంది. ప్రజంట్ గామి సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన కోపం వచ్చింది. ఓ ఇద్దరు లేడీ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కోపాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచింది. అమె కోపానికి కారణం ఓ వైరల్ వీడియో. అవును… ఆ వీడియోలో ఓ పెద్దాయనను.. లేడీ కానిస్టేబుల్స్ చితకబాదారు. 70 ఏళ్ల పైబడిన వ్యక్తి అని కూడా చూడకుండా నడిరోడ్డుపై లాఠీలతో రెచ్చిపోయారు. తనను కొట్టొద్దని ఆ వృద్ధుడు ఎంత వేడుకున్నా వాళ్లు జాలి చూపలేదు. బీహార్‌లో జరిగిన ఈ ఘటన ప్రజంట్ నేషన్ వైడ్ ట్రెండ్ అవుతుంది.

ఆయన వయసు పైబడిన ఓ రిటైర్డ్ టీచర్ అని.. సైకిల్‌పై వెళ్తూ నియంత్రణ కోల్పోయి  రోడ్డుపై పడిపోయాడని. ఆయన లేచి నిలబడేందుకు కొంత సమయం పట్టిందని… ఆ పెద్దాయన చేసిన తప్పు అదే  అంటూ ఓ జర్నలిస్ట్ ఈ వీడియోను షేర్ చేశాడు. దీంతో లేడీ కానిస్టేబుల్స్ ప్ర‌వ‌ర్తించిన తీరుపై నెటిజన్లు ఫైరవుతున్నారు. వారిని వెంటనే సస్పెండ్ చేసి.. ఆ పెద్దాయనకు క్షమాపణ చెప్పించాలని కోరుతున్నారు.

ఈ వీడియో చూసిన చాందిని చౌదరి ఆవేదనను వ్యక్తం చేసింది. త‌న‌కు చెప్ప‌లేనంత కోపంగా ఉంద‌ని, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..