Bhumika Chawla: ఆ రెండు సినిమాల నుంచి తప్పించారు.. భూమిక షాకింగ్ కామెంట్స్

ముఖ్యంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించి భారీ హిట్స్ అందుకుంది. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక్కడు అనే సినిమా చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా..

Bhumika Chawla: ఆ రెండు సినిమాల నుంచి తప్పించారు.. భూమిక షాకింగ్ కామెంట్స్
Bhumika Chawla

Updated on: Apr 29, 2023 | 7:31 AM

భూమిక చావ్లా.. ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ చిన్నది. ముఖ్యంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించి భారీ హిట్స్ అందుకుంది. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక్కడు అనే సినిమా చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా.. అలాగే మహేష్ బాబు కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఖుషి సినిమాలో నటించింది భూమిక. ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో భూమిక కు టాలీవుడ్ లో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాలో నటించింది ఈ పాలబుగ్గల చిన్నది. ఇక ఈ సినిమా కూడా మంచివిజయం సాధించడంతో  ఈ అమ్మడు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది.

ఆ తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. ఆ తర్వాత అక్కడ పలు సినిమాల్లో నటించింది. అక్కడి నుంచి మెల్లగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భూమిక. చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భూమిక ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ లో తాను చేయాల్సిన రెండు సినిమాలు మిస్ అయ్యయ్యని అవి చేసుంటే నేను నెక్స్ట్ లెవల్ లో ఉండేదాన్ని అంటున్నారు భూమిక.

తనను హీరోయిన్ గా ఎంపిక చేసిన తర్వాత అనూహ్యంగా తొలగించారని చెప్పుకొచ్చారు భూమిక. తేరే నామ్ తర్వాత ఓ పెద్ద సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని, అలాగే జబ్ వి మెట్ సినిమాలో కూడా ఛాన్స్ వచ్చింది. కానీ నన్ను ఆ సినిమాలనుంచి తప్పించారు అని చెప్పుకొచ్చారు భూమిక.. ఆ సినిమాలు చేసి ఉండుంటే నేను స్టార్ హీరోయిన్ గా రాణించేదాన్ని అని అన్నారు భూమిక.