
చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉంటుందో అంతే నష్టం కూడా ఉంటుంది. చాలా మంది సోషల్ మీడియా కారణంగా బారిన పడ్డారు. హీరోయిన్స్ కు సంబందించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటుంది. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అలాగే హీరోయిన్స్ వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. రీసెంట్ గానే కొంతమంది హీరోయిన్స్ ఓ ఉద్యమం మొదలు పెట్టారు. సినిమా ఈవెంట్స్ లో కొందరు తమ ఫోటోలను జూమ్ చేసి మరీ క్లిక్‌మనిపిస్తున్నారని ఆరోపించారు కొందరు.
ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ సోషల్ మీడియాలో ఎదుర్కున్న ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. తనను రే*ప్ చేస్తామంటూ బెదిరించారని ఆమె ఆరోపించింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అయేషా ఖాన్. ఈ అమ్మడు ముఖచిత్రం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాలు చేయలేదు కానీ చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఓం భీమ్ బుష్ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో తన అందాలతో కట్టిపడేసింది. అలాగే విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ సాంగ్ లోనూ తన అందాలతో కవ్వించింది అయేషా ఖాన్.
రీసెంట్ గా రణవీర్ సింగ్ హీరోగా నటించిన భారీ బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి కవ్వించింది. తాజాగా ఈ అమ్మడు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో నేను ఏ ఫోటో షేర్ చేసిన దాని కింద చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది నన్ను బెదిరిస్తున్నారు అని తెలిపింది. ప్రతిరోజు నాకు సోషల్ మీడియాలో రే**ప్ చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని నాతో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దారుణంగా కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. పట్టించుకోకుండా ఉందామనుకుంటే.. కేవలం కామెంట్స్ కాదు, నా వ్యక్తిగత భద్రతకు సంబంధించిన విషయం. కాబట్టి వారి పై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.