Amy Jackson: ఫస్ట్ లవ్ బ్రేకప్.. ప్రియుడిని రెండో పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ హీరోయిన్..

|

Aug 26, 2024 | 9:40 AM

వీరి వివాహనికి ఇరు కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది హీరోయిన్ అమీ జాక్సన్. కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది అంటూ తన భర్తపై ప్రేమను కురిపించింది. ప్రస్తుతం వీరి ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. వీటిని చూసిన నెటిజన్స్ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Amy Jackson: ఫస్ట్ లవ్ బ్రేకప్.. ప్రియుడిని రెండో పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ హీరోయిన్..
Amy Jackson
Follow us on

టాలీవుడ్ హీరోయిన్ అమీ జాక్సన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు ఎడ్ వెస్ట్ విక్ ను ఆమె వివాహం చేసుకుంది. ఇటలీలోని అమాల్ఫీ తీరంలో వీరిద్దరి వెడ్డింగ్ వేడుక ఘనంగా జరిగింది. వీరి వివాహనికి ఇరు కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది హీరోయిన్ అమీ జాక్సన్. కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది అంటూ తన భర్తపై ప్రేమను కురిపించింది. ప్రస్తుతం వీరి ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. వీటిని చూసిన నెటిజన్స్ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొన్నాళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. 2022లో డేటింగ్ స్టార్ట్ చేసిన ఈనెల ఆగస్ట్ 25న వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

ఈ ఏడాది జనవరి ప్రారంభంలో స్విట్జర్లాండ్ లోని జిస్టాడ్ లో అమీ జాక్సన్, ఎడ్ వెస్టివిక్ తమ ప్రేమబంధాన్ని బయటపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. అలాగే కొద్ది రోజుల క్రితం స్నేహితులతో కలిసి ప్రీ వెడ్డింగ్ పార్టీ చేసుకున్నారు. కొత్త జర్నీ ప్రారంభమయ్యిందంటూ ఇప్పుడు పెళ్లి ఫోటోలను షేర్ చేసింది. ఇదిలా ఉంటే.. అమీ జాక్సన్ గతంలో ఇంగ్లాండ్ కు చెందిన జార్జ్ పనియోటౌ అనే వ్యాపారత్తతో రిలేషన్ షిప్ లో ఉంది. వీరిద్దరికి ఆండ్రూ అనే బాబు జన్మించాడు. 2020లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు.

ఇవి కూడా చదవండి

అమీ జాక్సన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో పలు చిత్రాల్లో నటించింది. మదరాజుపట్నం, ఎవడు, ఐ, రోబో 2.0 వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోవడంతో సౌత్ సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.