Vishwak Sen: హీరో విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?

తోటి హీరోలందరితోనూ ఎంతో సరదాగా ఉంటాడు విశ్వక్ సేన్. ముఖ్యంగా నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లతో మాస్ కా దాస్ కు మంచి అనుబంధం ఉంది. అయితే ఓ విషయంలో ఈ నందమూరి హీరోలిద్దరూ విశ్వక్ సేన్ కు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు.

Vishwak Sen: హీరో విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
Vishwak Sen, Balakrishna, Jr NTR

Updated on: Feb 08, 2026 | 3:38 PM

‘లైలా’ డిజాస్టర్ తర్వాత మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఫంకీ. జాతిరత్నాలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేవీ అనుదీప్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రాగన్ బ్యూటీ కాయదు లోహర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్లు, ట్రైలర్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో హీరో విశ్వక్ సేన్ కూడా విస్తృతంగా మూవీ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఇందులో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడీ మాస్ హీరో. ఇదే క్రమంలో నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ తనకు ఒక విషయంలో వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్.

‘నా గత సినిమా లైలా. నేను ఆ సినిమాలో లేడీ గెటప్ లో కనిపిస్తాను. నిజానికి, దర్శకుడు రామ్ నారాయణ ఈ సినిమా కథ చెప్పినప్పుడు కొత్తగా ఉంది, ఈ మధ్య కాలంలో ఎవరు చేయలేదు కదా నేను చేస్తే ఒక కొత్త ప్రయత్నం అవుతుందనుకున్నాను.కానీ ఫైనల్ గా సినిమా క్రింజ్ గా మారింది. ఆడియన్స్ అసలు ఈ సినిమా చూడటానికి కూడా ఇష్టపడలేదు. ఇక ఆ సినిమా చూసి బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరూ ఫోన్ చేసి ఇంకోసారి ఇలాంటి ప్రయోగాలు చేయకు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు’ అని చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్.

ఇవి కూడా చదవండి

ఫంకీ సినిమాలో విశ్వక్ సేన్..

విశ్వక్ సేన్ బాలకృష్ణ, ఎన్టీఆర్ తో ఎంత క్లోజ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశ్వక్ సినిమా ఈవెంట్లకు, ఫంక్షన్లకు ముఖ్య అతిథులుగా వచ్చారీ నందమూరి హీరోలు. ఆ చనువుతోనే విశ్వక్ మంచి కోరి లైలా లాంటి సినిమాలు తీయద్దని బాలకృష్ణ, ఎన్టీఆర్ సూచించారట. ప్రస్తుతం విశ్వక్ సేన్ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి