
సైడ్ యాక్టర్ గా కెరీర్ ప్రారంభించాడు. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. అందులోనే తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. ఆపై హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు.. కానీ యాక్టర్ అంటే అన్ని పాత్రలు చేయాలిగా.. అందుకే విలన్ గానూ అదరగొట్టాడు. ఇప్పుడు దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అతను మరెవరో కాదు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి. టాలీవుడ్ ,కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోన్న ఈ వర్సటైల్ యాక్టర్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అలాగే తన బాల్యం, టీనేజ్ లో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు.
‘చిన్నప్పడు మేం చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాం. మా నాన్న మా భవిష్యత్ కోసం చాలా అప్పులు చేశాడు. అవి కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఒక్కోసారి అప్పులు కట్టలేదని మా ఇంటిపైకి దాడికి కూడా వచ్చేవాళ్లు. ఆ సమయంలో మా నాన్న ఒంటరిగా ఉండకూదని ఎప్పుడూ నేను ఆయన పక్కనే కూర్చునేవాడిని. మా నాన్నకు ఒక అలవాటు ఉండేది. ప్రతి రోజు రాత్రి 9.30 గంటలకు బుల్లెట్ బండిపై ఇంటికి వస్తూ.. ఫ్రైడ్ రైస్ వెంట తీసుకొచ్చేవాడు. మాతో కలిసి తినేవాడు. అది నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం.
‘ నేను అసలు యాక్టర్ అవ్వాలనుకోలేదు. కేవలం డబ్బు కోసమే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక అవసరాల కోసమే కెమెరా ముందుకు వచ్చాను. మొదట్లో సినిమాల్లో నటించడం అసలు నచ్చేది కాదు. కానీ కష్టపడి పని చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఏ పని అయినా సరే గౌరవంగా చేయడం నాకు అలవాటు. అందుకే సినిమాల్లోకి రాకముందు దుబాయ్‌లో అకౌంటెంట్‌గా పని చేశాను. స్కూల్ ఏజ్‌లో కూలీ పనికి వెళ్లాను. రిటైల్ స్టోర్‌లో సేల్స్‌మ్యాన్‌గా చేశాను. ఫాస్ట్ ఫుడ్ జాయింట్‌లో క్యాషియర్‌గా, ఫోన్ బూత్ ఆపరేటర్‌గా… ఇలా చాలా పనులు ఇష్టంతోనే చేశాను’ అని చెప్పుకొచ్చాడు మక్కల్ సెల్వన్. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్లమ్ డాగ్ లో హీరోగా నటిస్తున్నాడు విజయ్ సేతుపతి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి