మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో వరుణ్ తేజ్ తోపాటు.. వెంకటేష్, తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా ప్రధానపాత్రలలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు… ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే వరుణ్ తేజ్ మరో ప్రాజెక్ట్ మొదలెట్టనున్నారు..
వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా.. ఈ సినిమా జూన్ నెలాఖరు నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వినూత్నమైన కథాంశంతో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఎక్కువ భాగం లండన్లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో వినయ్ రాయ్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు ప్రచారం నడుస్తోంది.