Vithika Sheru: ‘ఎన్నో త్యాగాలు చేశారు.. మీరు లేరనే వార్త జీర్ణించుకోలేకపోతున్నా’.. వితికా షేరు ఎమోషనల్ పోస్ట్..

గతంలో బిగ్ బాస్ రియాల్టీ షోలో తన భర్తతో కలిసి పాల్గొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ షో నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది. అలాగే అటు యూట్యూబర్‏గా మారి క్రియేటివ్ వీడియోస్ చేస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే పలు జ్వువెల్లరీ సంస్థలకు.. దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ బిజీగా గడిపేస్తుంది. ఎప్పుడూ నెట్టింట ఎంతో సంతోషంగా.

Vithika Sheru: ఎన్నో త్యాగాలు చేశారు.. మీరు లేరనే వార్త జీర్ణించుకోలేకపోతున్నా.. వితికా షేరు ఎమోషనల్ పోస్ట్..
Vithika

Updated on: Feb 25, 2024 | 2:59 PM

భీమిలీ కబడ్డి జట్టు సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది వితికా షేరు. ఝుమ్మంది నాదం, ప్రేమ ఇష్క్ కాదల్, మహాబలి పురం, పెళ్లి సందడి చిత్రాల్లో నటించి మెప్పించింది. వరుసగా సినిమాలు చేస్తున్న కెరీర్ తొలినాళ్లలోనే టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాల్లో సహయ పాత్రలు చేస్తుంది వితికా. గతంలో బిగ్ బాస్ రియాల్టీ షోలో తన భర్తతో కలిసి పాల్గొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ షో నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది. అలాగే అటు యూట్యూబర్‏గా మారి క్రియేటివ్ వీడియోస్ చేస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే పలు జ్వువెల్లరీ సంస్థలకు.. దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ బిజీగా గడిపేస్తుంది. ఎప్పుడూ నెట్టింట ఎంతో సంతోషంగా.. సరదాగా పోస్టులు చేసే వితికా.. ఇప్పుడు ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన కుటుంబానికి బాగా కావాల్సిన వ్యక్తిని కోల్పోయినట్లు తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

“మా కుటుంబానికి మార్గనిర్దేశం చేసిన వ్యక్తి ఇకలేరనే విషయం తెలిసి మేమంతా షాకయ్యాము. ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నాం. మీరు ఎంతోమందికి సపోర్ట్ చేశారు. చాలామందికి మీరు గాడ్ ఫాదర్ లాగా ఎప్పటికీ గుర్తుండిపోతారు. జనాలను సంతోషంగా ఉంచడానికి ఎన్నో త్యాగాలు చేసిన మీకు ధన్యవాదాలు. మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆ భగవంతుడి వద్ద ఇప్పుడు మీరు ప్రశాంతంగా నిద్రపోండి” అంటూ అతడితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది వితికా.. అయితే మరణించిన వ్యక్తి ఎవరు ? అతడి పేరెంటీ ? అనే విషయాలు మాత్రం తెలియరాలేదు.

Vithika Sheru

వితికా చివరిసారిగా పెళ్లి సందడి సినిమాలో కనిపించింది. ఇదిలా ఉంటే.. కొత్త బంగారు లోకం సినిమాతో హీరోగా ఫుల్ క్రేజ్ అందుకున్నాడు వరుణ్ సందేశ్. కానీ ఆ తర్వాత సినిమాల ఎంపికలో తడబడ్డాడు. దీంతో స్టార్ హీరో క్రేజ్ కాపాడుకోలేకపోయాడు. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న అతను.. ఇప్పుడిప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. హీరోగానే కాకుండా సహయపాత్రలు చేస్తూ అలరిస్తున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.