Venu Madhav: సాయం చేయడంలో వేణు మాధవ్ రూటే వేరే.. ఉత్తేజ్ చెప్పిన రియల్ స్టోరీ..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన కామెడీ టైమింగ్, నటనతో తనదైన ముద్ర వేసిన హాస్య నటుడు వేణు మాధవ్. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. గతంలో ఓ ఇంటర్వ్యూలో నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ వేణు మాధవ్ గొప్ప మనసు గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరలవుతున్నాయి.

Venu Madhav: సాయం చేయడంలో వేణు మాధవ్ రూటే వేరే.. ఉత్తేజ్ చెప్పిన రియల్ స్టోరీ..
Venu Madhav

Updated on: Jun 28, 2026 | 7:51 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను అలరించిన హాస్య నటుడు వేణు మాధవ్. మిమిక్రీ ఆర్టిస్టుగా, యాంకర్ గా సినీ ప్రయాణం స్టార్ట్ చేసి.. ఆ తర్వాత నటుడిగా సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకున్నారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సంప్రదాయం అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ, మాస్టర్ వంటి చిత్రాలు ఆయనకు బ్రేక్ ఇచ్చాయి. దాదాపు రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో 500 సినిమాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2019లో వేణు మాధవ్ కన్నుమూశారు. కేవలం 49 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ఇప్పటికీ వేణు మాధవ్ నటించిన సీన్స్ యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాయి. ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ వేణు మాధవ్ గొప్ప మనసు గురించి చెప్పకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Cinema: 5 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది..

తెలుగు సినిమా పరిశ్రమలో హాస్యనటుడిగా తనదైన ముద్ర వేసుకున్న వేణుమాధవ్, కేవలం తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ గొప్ప మానవత్వం చూపారు. ఉత్తేజ్ మాట్లాడుతూ.. ఒక షూటింగ్ జరుగుతున్న సమయంలో, ఆకలితో, కష్టాలతో బాధపడుతున్న ఒక నటుడు వేణుమాధవ్‌ను కలిశారని.. సినిమాలు లేక, సంసారం గడవడం కష్టంగా ఉందని, సహాయం చేయమని ప్రాధేయపడ్డారని గుర్తు చేసుకున్నారు. వేణుమాధవ్ వెంటనే స్పందించి, “చూద్దాం” అని హామీ ఇచ్చారని అన్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత నటుడు ఉత్తేజ్ ను పిలిచి, తన ఇన్నోవా కారు వెనుక భాగాన్ని చూపించారు. అక్కడ రెండు బస్తాల బియ్యం, 10 కిలోల కందిపప్పు, 10 కిలోల పెసరపప్పుతో పాటు అల్లం వెల్లుల్లి నుండి ఉప్పు వరకు రెండు నెలలకు సరిపడా కిరాణా సామాగ్రి దాదాపు మూడు నెలల గ్రోసరీని సిద్ధం చేసి ఉంచారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‏తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..

“అన్నా, ఇది తిప్పి తిప్పి కొడితే 20,000 లోపు వచ్చాయి. కానీ వీడికి నేను 25,000 ఇస్తే ఇవ్వాళా రేపు అయిపోద్ది. పెళ్ళాం పిల్లలు ఆకలితోనే ఉంటారు. ఇది నేను చేసే సహాయం అన్నా,” అని వేణుమాధవ్ తన గొప్ప మనసును చాటుకున్నారని ఉత్తేజ్ అన్నారు. డబ్బు ఇచ్చి పంపడం కంటే, అవసరమైన నిత్యావసరాలు అందించడం ద్వారా ఆ కుటుంబం రెండు మూడు నెలల పాటు ఆకలి లేకుండా జీవించవచ్చని ఆయన ఆలోచన. ఇది వేణుమాధవ్ నిస్వార్థ సేవకు, దూరదృష్టికి నిదర్శనం.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‏గా త్రిష.. వీడియోస్ ఇదిగో..

Loading...
Unable to load recommendations.
Follow Us