Sunil Birthday : అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా మొదలుపెట్టి హీరోగా ఎదిగాడు..‌ కడుపుబ్బా నవ్వించాడు.. కళ్లెర్ర చేసి భయపెట్టాడు..

టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు సునీల్. నేడు ( ఫిబ్రవరి 28) సునీల్ పుట్టిన రోజు.  బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ

Sunil Birthday : అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా మొదలుపెట్టి హీరోగా ఎదిగాడు..‌ కడుపుబ్బా నవ్వించాడు.. కళ్లెర్ర చేసి భయపెట్టాడు..

Updated on: Feb 28, 2021 | 12:30 PM

Sunil Birthday : టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు సునీల్. నేడు ( ఫిబ్రవరి 28) సునీల్ పుట్టిన రోజు.  బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ ఇలా పలువురు కమెడియన్లుగా రాణిస్తున్న సమయంలో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు నునిల్. విలన్ అవుదామని వచ్చి కమెడియన్‌గా టాప్ లెవల్‌కు వెళ్లిపోయాడు. నువ్వే కావాలి సినిమాతో పరిచయం అయిన సునీల్.. నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సినిమాలతో స్టార్ కమెడియన్ అయ్యాడు.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్ని సినిమాల‌కు అసిస్టెండ్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశాడుసునీల్ . ఇక  కమెడియన్ గా కొనసాగుతున్న సమయంలో సునీల్ సంవత్సరానికి దాదాపు 15 సినిమాల్లో కమిడియన్ గా కనిపించేవారు. నందితో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు.ఆతర్వాత సునీల్ హీరోగా మారాడు.  అందాల రాముడు సినిమాతో సునీల్ హీరోగా మారాడు. ఈసినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆతర్వాత కూడా సునీల్ కమెడియన్ గా కొనసాగాడు అదే సమయంలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాలో సునీల్ హీరోగా నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అంతే కాదు హీరోగా సునీల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత పూలరంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు, జక్కన , కృష్ణాష్టమి లవంటి సినిమాలతో పర్వాలేదనిపించుకున్నాడు. హీరోగా మారినతర్వాత సునీల్ సిక్స్ ప్యాక్ కూడా చేసాడు .

ఇక హీరోగా సునీల్ అంతగా రాణించలేక పోయాడు. తిరిగి కమెడియన్ గా చేసాడు సునీల్. కానీ పాత సునీల్ ను చూడలేక పోయారు ప్రేక్షకులు. అప్పటిలా సునీల్ నవ్వించలేక పోయాడు. ఇప్పుడు విలనిజం తో బయపెడుతున్నాడు సునీల్. రవితేజ నటించిన డిస్కోరాజా సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు సునీల్. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాకపోయినా సునీల్ నటనకు మంచి పేరొచ్చింది. ఆతర్వాత కలర్ ఫోటో సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకున్నడు. ప్రస్తుతం అటు విలన్ గా ఇటు హీరోగా పలు సినిమాల్లో నటిస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sundeep Kishan : హీరోగానే కాదు బిజినెస్‌‌‌‌‌‌మ్యాన్ గాను బిజీగా మారుతున్న యంగ్‌‌‌‌‌హీరో.. త్వరలో మరో వ్యాపారం..

Telugu contestants in Indian Idol : ఇండియన్ ఐడల్ లో పాల్గొని తమ ప్రతిభ చూపించిన తెలుగు గాయనీగాయకులు ఎవరంటే..

 

Loading...
Unable to load recommendations.
Follow Us