ఆ హీరో చాలా గొప్పోడు.. స్కూటర్‌ మీద తిరిగే నాకు కారు కొనిచ్చాడు.. అది ఇప్పటికీ నాతోనే ఉంది

నటుడు సత్య ప్రకాష్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గారితో తన తొలి అనుభవాలను, చిరంజీవి గారి గొప్పదనాన్ని వివరంగా పంచుకున్నారు. ఇండస్ట్రీలో తనకు రవిరాజా పినిశెట్టి గారు అవకాశం ఇచ్చినా, సినీ ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం ఓ స్టార్ హీరో అని సత్య ప్రకాష్ స్పష్టం చేశారు.

ఆ హీరో చాలా గొప్పోడు.. స్కూటర్‌ మీద తిరిగే నాకు కారు కొనిచ్చాడు.. అది ఇప్పటికీ నాతోనే ఉంది
Satya Prakash

Updated on: Sep 25, 2026 | 12:36 PM

తెలుగు సినీ పరిశ్రమలో విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్య ప్రకాష్. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన.. తన సినీ ప్రయాణంలో ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ ఆయన నిజజీవితంలో ఎంతో విభిన్నంగా ఉంటారు. సత్యప్రకాష్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేసిన అనుభవాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి తన పట్ల చూపించిన ఆప్యాయత, ప్రోత్సాహం గురించి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. సత్య ప్రకాష్‌కు ఇండస్ట్రీలో అవకాశం కల్పించిన వారిలో దర్శకుడు రవిరాజా పినిశెట్టి ఒకరని ఆయన గతంలో పేర్కొన్నారు. అయితే తనకు సినీ ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తిగా మాత్రం చిరంజీవిని ఆయన గుర్తుచేసుకున్నారు.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

తన కెరీర్ ప్రారంభ దశలోనే చిరంజీవితో కలిసి పనిచేసే అవకాశం రావడం తనకు ప్రత్యేకమైన అనుభవమని సత్య ప్రకాష్ చెప్పారు. బిగ్ బాస్ సమయంలో మెగాస్టార్‌తో కలిసి పనిచేశానని, దాదాపు వారం రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నానని తెలిపారు.  చిరంజీవి కేవలం ఒక తరం హీరో మాత్రమే కాదని.. ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి అని సత్య ప్రకాష్ ప్రశంసించారు. సినిమా అనే రంగం ఉన్నంత కాలం చిరంజీవి పేరు ఒక ఐకాన్‌గా నిలుస్తుందని ఆయన అన్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత తాను అప్పట్లో ఎల్‌ఎంఎల్ టీ-5 స్కూటర్‌పై ఇంటికి వెళ్లేవాడినని సత్య ప్రకాష్ గుర్తుచేసుకున్నారు. ఒకసారి హెల్మెట్ లేకుండా స్కూటర్‌పై వెళ్తుండగా చిరంజీవి తనను గమనించి ఆపి మాట్లాడారని తెలిపారు.

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

హెల్మెట్ లేకుండా బైక్ నడపడం ప్రమాదకరమని చిరంజీవి తనకు చెప్పారని, భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్లాల్సిన నటుడిగా తన ఆరోగ్యం, భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారని సత్య ప్రకాష్ తెలిపారు. ఆ సమయంలో సత్య ప్రకాష్ స్కూటర్‌పై షూటింగ్‌కు వస్తుండటాన్ని గమనించిన చిరంజీవి.. తనకు కారు కొనిపెడతానని చెప్పారట. అప్పట్లో కారు అనేది తనలాంటి నటుడికి చాలా పెద్ద విషయమని సత్య ప్రకాష్ గుర్తుచేసుకున్నారు. తర్వాత చిరంజీవి చెప్పినట్టుగానే మారుతి ఓమ్ని కారును కొనిపెట్టారని ఆయన తెలిపారు. ఆ కారు తన కుటుంబ జీవితంలో ఎన్నో జ్ఞాపకాలకు సాక్ష్యంగా నిలిచిందని సత్య ప్రకాష్ భావోద్వేగంగా చెప్పారు. తాను జీవితంలో ఎన్నో కార్లు మార్చినా.. చిరంజీవి ఇచ్చిన మొదటి కారు మాత్రం తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని ఆయన పేర్కొన్నారు. ఆ కారులోనే తన భార్య డ్రైవింగ్ నేర్చుకున్న విషయాన్ని కూడా సత్య ప్రకాష్ గుర్తుచేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us