Rakul Preeth Singh: బ్లాక్ డ్రెస్‏లో రెచ్చిపోయిన పంజాబీ బ్యూటీ.. ధర తెలిస్తే మైండ్ బ్లాంకే..

ఇందులో భాగంగా శనివారం విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో చురుగ్గా పాల్గోంటుంది రకుల్. తాజాగా ఆమె తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

Rakul Preeth Singh: బ్లాక్ డ్రెస్‏లో రెచ్చిపోయిన పంజాబీ బ్యూటీ.. ధర తెలిస్తే మైండ్ బ్లాంకే..
Rakul Preet Singh

Updated on: Aug 24, 2022 | 6:57 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth Singh). అతి తక్కువ సమయంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ పంజాబీ బ్యూటీ. తెలుగులో చివరగా కొండపొలం సినిమాతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. గత కొద్దిరోజులుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్థిరపడిపోయింది. అక్కడ ఎక్కువ అవకాశాలు రావడంతో ప్రస్తుతం అక్కడే బిజీగా ఉంటుంది. స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన కట్ పుత్లి హాట్ స్టార్ లో సెప్టెంబర్ 2న ప్రసారం కానుంది. ఇందులో భాగంగా శనివారం విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో చురుగ్గా పాల్గోంటుంది రకుల్. తాజాగా ఆమె తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

అందులో బ్లాక్ డ్రెస్ ధరించి.. సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్ మెరిసిపోతుంది. అయితే ఇప్పుడు రకుల్ ధరించిన డ్రెస్ట్ ధర గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. రకుల్ ధరించిన డ్రెస్ దాదాపు రూ. 38 వేలు ఉంటుందట. దానిని గౌరీ, నైనిక అనే డిజైనర్లు తయారు చేశారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రకుల్ డాక్టర్ జీ, థాంక్యూ, అయలాన్, చాత్రివలి చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో మంచి కంటెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ వస్తే రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా లేడీ ఓరియెంటెండ్, బయోపిక్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us