రాజమౌళి సినిమాల్లో ఆ సినిమా నాకు అస్సలు నచ్చదు.. కానీ భారీ హిట్ అయ్యింది : ప్రభాస్

తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వేదికపై చాటిచెప్పి, ఆస్కార్ అవార్డు సాధించి చరిత్ర సృష్టించిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి అఖండ విజయాల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకున్నాయి.

రాజమౌళి సినిమాల్లో ఆ సినిమా నాకు అస్సలు నచ్చదు.. కానీ భారీ హిట్ అయ్యింది : ప్రభాస్
Prabhas

Updated on: Oct 28, 2026 | 10:23 AM

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన కెరీర్‌ను ప్రారంభించిన స్టూడెంట్ నంబర్ 1 చిత్రంపై తాజాగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక టీవీ షోలో ప్రభాస్, రాజమౌళి పాల్గొన్నారు. ఆ షోలో రాజమౌళి మాట్లాడుతూ, తన తొలి చిత్ర విశేషాలను పంచుకున్నారు, అలాగే ఈ స్టూడెంట్ నంబర్ 1 సినిమాపై  ప్రభాస్ కూడా మాట్లాడారు. స్టూడెంట్ నంబర్ 1 సినిమాను చూసినప్పుడు ఆ సినిమా తనకు పూర్తిగా నచ్చలేదని, కేవలం సినిమా ఇంటర్వెల్ మాత్రమే బాగుందని చెప్పారు ప్రభాస్. అలాగే సాంగ్స్ బాగుంటాయి అని అన్నారు.ఎందుకో ఆ సినిమా నాకు అంతగా నచ్చలేదు. కానీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అని ప్రభాస్ అన్నారు. స్టూడెంట్ నంబర్ 1 చిత్రంలోని పాటలు అప్పట్లో భారీ విజయాలు సాధించాయి. పడ్డానండి ప్రేమలో మరి, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వంటి పాటలు సంగీత ప్రియులను ఎంతగానో అలరించాయి. అయితే, పడ్డానండి ప్రేమలో మరి పాట వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉందని రాజమౌళి తెలిపారు.

ఈ పాట ట్యూన్‌ను తాను మొదట విన్నప్పుడు అస్సలు ఇష్టపడలేదని, తనకు అది ఏమాత్రం నచ్చలేదని వెల్లడించారు రాజమౌళి. తన గురువు (రాఘవేంద్రరావు) ఈ ట్యూన్‌ను ఓకే చేశారని, ఆయనకు నచ్చితే ప్రజలకు కూడా నచ్చుతుందని కీరవాణి చెప్పారని రాజమౌళి గుర్తుచేసుకున్నారు. ఆ పాట భారీ హిట్ అవుతుందని తన గురువు చెప్పిన మాటలను తాను నమ్మలేదని, కానీ చివరికి ఆ పాట భారీ విజయంగా నిలిచిందని అన్నారు. ఆడియో విడుదలైన తర్వాత పాట ఎంత పెద్ద హిట్టయిందో చూసి ఆశ్చర్యపోయానని రాజమౌళి పేర్కొన్నారు.

అలాగే, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అనే కాలేజ్ ఫేర్‌వెల్ సాంగ్ కూడా పెద్ద హిట్‌గా నిలిచిందని రాజమౌళి వివరించారు. అలాగే  ఈ పాటలో వచ్చే బిట్ తనకెంతో ఇష్టమని తెలిపారు. ఈ పాట సాహిత్యం అద్భుతంగా ఉంటుందని, చంద్రబోస్‌తో తన గురువు రాయించారని, లిరిక్స్‌లో ఆ బలం ఉందని రాజమౌళి క్రెడిట్ ఇచ్చారు. ఒక కామన్ మ్యాన్ దగ్గర నుండి ఐఏఎస్ ఆఫీసర్ వరకు అందరూ తమ జీవితంలో అనుభవించే భావోద్వేగాలను ఈ పాట ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. కాలేజీ నుంచి విడిపోయేటప్పుడు కలిగే అనుభూతిని ఈ పాట చక్కగా పట్టిందని రాజమౌళి వివరించారు. అలాగే స్టూడెంట్ నంబర్ 1 చిత్ర నిర్మాణ సమయంలో ఎదురైన సవాళ్లను కూడా రాజమౌళి పంచుకున్నారు. పాటల చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ వెళ్లినప్పుడు, సమయం సరిపోక కొన్ని షాట్‌లను ఇండియాలో చిత్రీకరించాల్సి వచ్చిందట. దీనిపై నిర్మాత సోయాబ్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారని, తన మొదటి సినిమాకే బ్యాలెన్స్ పెట్టుకుంటున్నావని ప్రశ్నించారని రాజమౌళి చెప్పారు. అయితే, గురువు రాఘవేంద్రరావు మార్గదర్శకత్వంలో ప్రజలకు నచ్చేలా సినిమాను తీర్చిదిద్దాలనే ఒకే ఒక లక్ష్యంతో పని చేశానని రాజమౌళి స్పష్టం చేశారు. ఎక్కడో పుట్టి పాట చిత్రీకరణలో ఒక షాట్ తీసినప్పుడు అది రాఘవేంద్రరావు తీశారని చాలా మంది భావించారని, కానీ తాను తీశానని రాజమౌళి సంతోషంగా వివరించారు. తన టేకింగ్‌లో ఏ గొప్పతనం లేదని, అంతా లిరిక్స్‌లోనే ఉందని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us