
టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ప్రస్తుతం ఉన్న యువ నటులలో నిఖిల్ ఒకరు. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో నిఖిల్.. మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత విభిన్న కథలను ఎంచుకుంటూ సరికొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తూ.. ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. అలా కార్తీకే, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. అటు సినిమాలు చేస్తూనే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు నిఖిల్. అటు రాజకీయ అంశాలపై.. సమాజంలో జరుగుతున్న విషయాలపై స్పందిస్తూ.. ట్వీట్స్ చేస్తుంటారు. అలాగే కరోనా లాక్డౌన్ సమయంలో నిఖిల్ ఎందరికో సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. అంతేకాదు.. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీమ్‌ను ఏర్పాటు చేసి సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని వారికి సాయం చేశారు. ప్రస్తుతం నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 18 పేజెస్ సినిమాతోపాటు.. కార్తీకేయ 2 సినిమా చేస్తున్నారు. ఇటీవల విడుదలైన 18 పేజెస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే.. సామాజిక అంశాలపై… రాజకీయ సమీకరణాలపై.. ఇండస్ట్రీలో జరిగే సంఘటనలపై.. మనసును కదిలించే అంశాలపై.. సూటిగా సుత్తిలేకుండా.. గాడంగా గంభీరంగా ట్వీట్లు చేస్తుంటారు హీరో నిఖిల్. అయితే తాజాగా అలాంటి ఓ ట్వీట్‌తోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు ఈ క్రేజీ హీరో. “మన చుట్టూ ఉన్న ప్రపంచం పర్ఫెక్ట్గా లేదు… యుద్ధాలు, రోగాలు, రొస్టులు, అశాంతి పరిస్థితులు.. అన్యాయాలు… అక్రమాలు.. ఇలాంటి వాటిని చూసినప్పుడు.. మనలో జనించిన ఆవేశాన్ని.. ఆక్రోశాన్ని… ఆవేదనను… అణిచివేయకుండా.. జిమ్‌లో ఖర్చు పెట్టండి… వర్కవుట్స్ చేయండి… పాజిటివిటితో మైండ్‌ని ఫిల్ చేయండి” అంటూ నిఖిల్ జిమ్ చేస్తున్న వీడియోతో పాటు తన ట్వీట్ లో రాసుకొచ్చారు.
ట్వీట్..
Also Read: Shruti Haasan: అమెజాన్ ప్రైమ్‌తో భారీ డీల్ చేసుకున్న శ్రుతిహాసన్.. పెద్ద సాహసమే చేస్తోందిగా..
Lakshya Movie: షూటింగ్ పూర్తిచేసిన లక్ష్య.. త్వరలోనే థియేటర్లలో కలుద్దామంటూ యంగ్ హీరో ట్వీట్..