సినిమా కోసం నటీనటులు ఎంతగా కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా హీరో.. సినిమా సినిమాకు తన రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుంటాడు. కథ నచ్చితే చాలు.. క్యారెక్టర్ కోసం తమ శారీరాకృతిని పూర్తిగా చేంజ్ చేస్తుంటారు. ఇప్పటికే విక్రమ్.. అల్లు అర్జున్.. ప్రభాస్ వంటి స్టార్ హీరోస్ సినిమాల కోసం తమ శారీరకృతిని ఎంతగా మార్చుకున్నారో తెలిసిన విషయమే. తాజాగా మరో యంగ్ అండ్ స్టైలీష్ హీరో పూర్తిగా తన రూపాన్నే కాదు.. శారీరాకృతిని మార్చేశాడు..
పైన ఫోటోను చూస్తున్నారుగా.. గుర్తుపట్టారా ఎవరనేది.. పైన ఫోటోలో ఉన్న స్టైలీష్ అండ్ హ్యాండ్సమ్ హీరో. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. అమ్మాయిల్లో తెగ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు లవర్ బాయ్‌గా ఈ యంగ్ హీరో.. ఇప్పుడు తన తదుపరి సినిమా కోసం పూర్తిగా గెటప్ చేంజ్ చేశాడు. ఎవరో చెప్పుకొండి.
పైన ఫోటోలో ఉన్నది మరెవరో కాదండోయ్.. టాలెంటెడ్ హీరో నవదీప్.. జై సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమై.. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస చిత్రాలను చేస్తూ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా.. స్నేహితుడిగా.. అన్నయ్యగా.. విలన్ పాత్రలలోనూ నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో లవ్ మౌళి అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో నవదీప్ పూర్తిగా విభిన్నంగా కనిపించనున్నాడు. ఇటీవల ఈ హీరో బర్త్ డే కానుకగా లవ్ మౌళీ సినిమా నుంచి నవదీప్ ఫస్ట్ లుక్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. లవ్ మౌళీ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read: Anupama Parameshwaran: నెట్టింట్లో అనుపమ రచ్చ.. రాత్రి అంటే వైన్ ఉండాల్సిందేనంటున్న హీరోయిన్..
Bhala Thandanana: యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది ‘భళా తందనాన’ టీజర్
Puneeth Rajkumar: తమ్ముడి చివరి సినిమాకు డబ్బింగ్ చెప్తూ కన్నీళ్లు పెట్టున్న శివన్న..
Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?