
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హిట్ సిరీస్ లో భాగంగా వస్తోన్న ఈ మూడో చిత్రానికి డైరెక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాని జోడిగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ఇటీవల విడుదలైన హిట్ 3 మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అంతేకాకుండా యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తుంది హిట్ 3 ట్రైలర్. ఇక ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని వయోలెన్స్ పాత్రలో నాని కనిపించనున్నారు. దీంతో ఈ సినిమా చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న నాని మొదటి రివ్యూస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విడుదల రోజే రివ్యూలు ఇవ్వడం వల్ల సినిమాలపై ప్రభావం ఉంటుందని గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నాని మాట్లాడుతూ.. “రివ్యూస్ ఎందుకు ఆగాలి.. ? ఎందుకు ఆపాలి.. ఎవర్ని ఆపాలి.. ఎవరినీ ఆపరేలు.. నాకు నచ్చలేదు అనండి ఒకే.. కానీ సినిమా ఆడదు అని ముందే చెప్పకండి. సినిమా డిజాస్టర్ అని ఒక్కరోజులో ఎలా చెప్తారు. సినిమా విడుదలైనా పది రోజులైనా ఎవరూ చూడకపోతే అప్పుడు చెప్పండి డిజాస్టర్ అని.. ఫస్ట్ డే మార్కింగ్ షోకే ఎలా డిసైడ్ చేస్తారు.. వ్యక్తిగతంగా సినిమాపై అభిప్రాయం ఎలా చెప్పినా.. మీడియా ప్రొఫెషనల్స్ ఇలా చేయడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం” అని అన్నారు.
“నా సినిమా విషయంలోనే ఇలాంటివి జరగలేదు.. కానీ అబ్బో.. తలనొప్పి వచ్చేసింది అంటూ కొన్ని సినిమాల విషంయలో కొందరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చూశా.. వ్యక్తిగతంగా ఒకే గానీ…ప్రొఫెషనల్స్ ఇలా చేయడం కరెక్ట్ కాదు ” అన్నారు. ఇదిలా ఉంటే హిట్ 3 చిత్రంలో నాని అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..