న్యాచురల్ స్టార్ నాని (Nani) ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇటీవల శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తాజాగా ఇప్పుడు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమయ్యాడు న్యాచురల్ స్టార్. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ సినిమా అంటే సుందరానికీ అంటూ మరోసారి థియేటర్లలో సందడి చేయనున్నారు. బ్రోచేవారేవరురా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్‌తో సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది చిత్రయూనిట్. ఫిబ్రవరి 24న న్యాచురల్ స్టార్ నాని పుట్టిన రోజు కానుకగా బుధవారం అంటే సుందరానికీ నుంచి ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
అంతేకాకుడా.. వీడియోతోపాటు.. సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసింది. తాజాగా సుందరుడి బర్త్ డే హోమం పేరుతో విడుదలైన వీడియో నవ్వులు పూయిస్తుంది. పుట్టినరోజున ఏంటి ఇది ? ఇంకో రెండు హోమాలు చేస్తే గిన్నిస్ బుక్ ఎక్కొచ్చు అంటూ నాని డైలాగ్ చెప్పిన తీరు నవ్వులు పూయిస్తుంది. చిన్నప్పటి నుంచి వరుస గండాలు ఉన్న యువకుడిగా నాని కనిపిస్తున్నాడు. ఆ గండాల నుంచి గట్టేక్కెందుకు వరుసగా హోమాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
” అంటే … మా వాడి జాతకం ప్రకారం ‘Barthhday Homam’ జరిగిన 108 రోజులు వరకు బయటికి రాకూడదన్నారు, అందుకే JUNE 10న మిమ్మల్ని నవ్వించడానికి Theatres కి వస్తున్నాడ. యువ సుందరుడి బర్త్ డే హోమం ఇప్పుడే మొదలైంది ” అంటూ చిత్రయూనిట్ చేసిన ట్వీట్ చేసింది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతోపాటు నాని దసరా అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
అంటే… మా వాడి జాతకం ప్రకారం ‘Barthhday Homam’ జరిగిన 108 రోజులు వరకు బయటికి రాకూడదన్నారు, అందుకే JUNE 10న మిమ్మల్ని నవ్వించడానికి Theatres కి వస్తున్నాడు ♥
Happy Birthday Sundar, Blockbuster ప్రాప్తిరస్తు
– https://t.co/6siYvRcqzI#SundarBarthhdayBlast ?#AnteSundaraniki pic.twitter.com/loIiACm7BH
— Mythri Movie Makers (@MythriOfficial) February 23, 2022
Also Read: Bheemla Nayak: భీమ్లా నాయక్ ట్రైలర్‌పై రామ్ చరణ్ ఏమన్నారో తెలుసా.? మెగా రివ్వ్యూ..
‘మాంగళ్యం తంతునానేనా మన లైఫ్ లో ఇది జరుగునా’.. ఆడవాళ్లు మీకు జోహార్లు కొత్త సాంగ్ విన్నారా.?
Keerthy Suresh: సూపర్ స్టైలీష్ లుక్‌లోఫ్యాన్స్ గుండెలను కొల్లగొడుతున్న కీర్తి సురేష్ లేటెస్ట్ పిక్స్
Ashu Reddy: లంగా వోణీ రచ్చ చేస్తున్న అషు రెడ్డి లేటెస్ట్ ఫోటోస్ వైరల్