Varudu Kavalenu: అప్‏డేట్ వచ్చేసింది.. వరుడు కావలెను టీజర్ విడుదల ఎప్పుడంటే..

కరోనా కేసులు తగ్గి.. థియేటర్లు తెరుచుకోవడంతో చిన్న, పెద్ద సినిమాలు వడివడిగా షూటింగ్ పూర్తిచేసే పనిలో పడ్డాయి. పోస్టర్స్, టీజర్స్,

Varudu Kavalenu: అప్‏డేట్ వచ్చేసింది.. వరుడు కావలెను టీజర్ విడుదల ఎప్పుడంటే..
Varudu Kavalenu

Updated on: Aug 29, 2021 | 7:29 PM

కరోనా కేసులు తగ్గి.. థియేటర్లు తెరుచుకోవడంతో చిన్న, పెద్ద సినిమాలు వడివడిగా షూటింగ్ పూర్తిచేసే పనిలో పడ్డాయి. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్, రిలీజ్ డేట్స్ అంటూ సోషల్ మీడియాలో సినీ సందడి కొనసాగుతుంది. ఇప్పటికే థియేటర్లలో విడుదలైన సినిమాలు సూపర్ హిట్ అందుకోవడంతో తమ సినిమాలను కూడా వీలైనంత త్వరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్. తాజాగా నాగశౌర్య, హీరోయిన్ రీతూ జంటగా నటిస్తోన్న వరుడు కావలెను సినిమా టీజర్ అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ మూవీ టీజర్‏ను ఆగస్ట్ 31న విడుదల చేయనున్నట్లుగా పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటిస్తోన్న ఈ సినిమాను ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పొస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనుంది చిత్రయూనిట్. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.

ట్వీట్..

Also Read: Suma Kanakala: తల్లితో కొత్త ప్రోగ్రామ్‌ను ప్లాన్‌ చేస్తున్న సుమ..? అప్పటి వరకు ఎదురు చూడండి అంటూ పోస్ట్.

Oliviak Morris: హైదరాబాద్ పానీ పూరికి ఆర్ఆర్ఆర్ బ్యూటీ ఫిదా.. వీధుల్లో సందడి చేసిన హాలీవుడ్ హీరోయిన్..

Krithi Sanon: ప్రభాస్ గురించి షాకింగ్ విషయాలను చెప్పిన స్టార్ హీరోయిన్.. అందరూ అనుకునేవి నిజం కాదంటూ..

Shanmukh Jaswanth: ఇది ప్రమోషనల్ పోస్ట్ కాదంటునే ఆ సంస్థపై పొగడ్తల వర్షం కురిపించిన షణ్ముఖ్.. జాగ్రత్త అంటున్న నెటిజన్స్..

 

Loading...
Unable to load recommendations.
Follow Us