The Family Man 3: ఫ్యామిలీ మ్యాన్ 3 ఎలా ఉండబోతుందో చెప్పిన మనోజ్ బాజ్‌పాయ్

ఇప్పటివరకు ఈ సిరీస్ నుంచి రెండు సీజన్ వచ్చాయి. ఈ రెండు సీజన్స్ సూపర్ హిట్ గా నిలిచాయి.  మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణితోపాటు 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ లో చాలా మంది నటించారు.  ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఫ్యామిలీ మ్యాన్ నుంచి ఇప్పుడు మూడో సీజన్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి.

The Family Man 3: ఫ్యామిలీ మ్యాన్ 3 ఎలా ఉండబోతుందో చెప్పిన మనోజ్ బాజ్‌పాయ్
Family Man 3
Follow us

|

Updated on: Apr 18, 2024 | 12:26 PM

ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి వెబ్ సిరీస్ లు.. ఇక ఇప్పటివరకు వచ్చిన వెబ్ సిరీస్ లలో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కు సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇప్పటివరకు ఈ సిరీస్ నుంచి రెండు సీజన్ వచ్చాయి. ఈ రెండు సీజన్స్ సూపర్ హిట్ గా నిలిచాయి.  మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణితోపాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ లో చాలా మంది నటించారు.  ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఫ్యామిలీ మ్యాన్ నుంచి ఇప్పుడు మూడో సీజన్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈసారి రాజ్‌, డీకే ఏ కథతో వస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. తాజాగా నటుడు మనోజ్ బాజ్‌పేయి ఈ సిరీస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

మనోజ్ మాట్లాడుతూ..  ది ఫ్యామిలీ మ్యాన్ 3′ సీజన్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2′ సిరీస్ ముగింపులో, మూడవ సిరీస్ వస్తుందని తెలిపారు. ఈసారి వైరస్‌ నేపథ్యం ఉంటుందని ఆయన అన్నారు. అలాగే మనోజ్ బాజ్‌పాయ్ మాట్లాడారు.

మూడో సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రెండో సీజన్ కథ ముగిసిన చోట నుండి కొత్త కథ కొనసాగుతుంది. గత సీజన్ కంటే ప్రస్తుత సీజన్ మరింత మెరుగ్గా, చక్కగా, ఇంట్రెస్టింగ్ గా  ఉంటుంది’ అని మనోజ్ అన్నాడు. అంతకుముందు సీజన్ లో ఆయన చెప్పిన డైలాగ్‌లు మీమ్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈసారి కూడా అలాంటి డైలాగ్స్ ఉంటాయా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాని మనోజ్ అవును ఈసారి కూడా ఉంటాయి అని సమాధానం ఇచ్చాడు. ఈ సీజన్ లో శ్రీకాంత్ తివారీకి కొత్త పరిస్థితులు ఎదురవుతాయి. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వ్యక్తిగతంగా, కెరీర్ లో సవాళ్లు పెరుగుతాయి’ అని మనోజ్ అన్నారు. దీంతో ఈ సిరీస్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఈ సీజన్‌పై చాలా అంచనాలు ఉన్నాయి. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ తర్వాత రాజ్, డీకే ‘ఫర్గీ’ సిరీస్ చేశారు. ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇది హాలీవుడ్ సిటాడెల్ కు ఇండియన్ వెర్షన్. ఇండియన్ వెర్షన్‌లో సమంత, వరుణ్ ధావన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ లో బిజీగా ఉన్నారు రాజ్, డీకే.

View this post on Instagram

A post shared by ZEE5 (@zee5)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.