అందం, వెన్నెల కలయిక ఈ బ్యూటీ రూపం..
TV9 Telugu
01 May 2024
6 డిసెంబర్ 1999న కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది సిజ్లింగ్ బ్యూటీ నేహా శెట్టి.
ఈ ముద్దుగుమ్మ తల్లి డెంటిస్టుగా పని చేస్తున్నారు. ఆమె తండ్రి వ్యాపారవేత్తగా ఉన్నారు. ఒక చెల్లెలు ఉన్నారు.
మోడలింగ్‌లో తన వృత్తిని ప్రారంభించింది. 2014లో జారిన మిస్ మంగళూరు అందాల పోటీలో కిరీటాన్ని గెలుచుకుంది.
2015లో హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్ సౌత్ ఇండియా అందాల పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది ఈ అందాల తార.
2016లో ముంగారు మేల్ 2 అనే కన్నడ రొమాంటిక్ చిత్రంతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ.
2018లో మెహబూబా చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. తర్వాత గుల్లి రౌడీ, మోస్ట్ ఎల్జిబాల్ బ్యాచిలర్ సినిమాల్లో నటించింది.
2022 సిద్దు జొన్నలగడ్డకి జోడిగా నటించిన DJ టిల్లుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బెదురులంక 2012తో మరో హిట్ అందుకుంది.
తాజాగా విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమాలో అతిధి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం గ్యాంగ్స్ అఫ్ గోదావరిలో నటిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి