అందమే పోటీ పడటనికి భయపడే అందం ఈ బ్యూటీ సొంతం..

TV9 Telugu

01 May 2024

13 నవంబర్ 1998న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ శ్రీ గౌరీ ప్రియా రెడ్డి.

హైదరాబాద్ మహా నగరంలో ఉన్న ఓ స్థానిక ఉన్నత పాఠశాలలో తన స్కూలింగ్ విద్యను పూర్తిచేసింది ఈ ముద్దుగుమ్మ.తో కట్టిపడేసింది.

హైదరాబాద్ లో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్‌ నుంచి మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పట్టా పొందింది ఈ బ్యూటీ.

పాఠశాలలో చదువుతున్న సమయంలోనే నటనతో పాటు.. మోడలింగ్‌పై తీవ్ర ఆసక్తిని పెంచుకుంది ఈ తెలుగు ముద్దుగుమ్మ.

సినిమాలకు ముందు మోడల్ గా 2018లో జరిగిన మిస్ హైదరాబాద్ అందాల పోటీల్లో టైటిల్‌ను గెలుచుకుంది ఈ వయ్యారి.

2021లో ప్రియదర్శి హీరోగా చేసిన పీరియడ్ కామెడీ ఎంటర్‌టైనర్ మెయిల్ చిత్రంతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది.

తర్వాత సుహాస్ హీరోగా నటించిన సూపర్‌హిట్ మూవీ రైటర్ పద్మభూషణ్‌లో ఖన్నా అనే పాత్రలో ఆకట్టుకుంది ఈ భామ.

2023లో వచ్చిన కామెడీ డ్రామా చిత్రం మ్యాడ్ సినిమాలో శృతి పాత్రలో తన అందంతో కుర్రాళ్లను ఫిదా చేసింది ఈ బ్యూటీ.