క‌రోనా క‌ష్టాలు.. కూర‌గాయ‌లు అమ్ముకుంటున్న న‌టుడు

|

Jun 28, 2020 | 10:08 PM

తాజాగా యాక్ట‌ర్ జావేద్ హైద‌ర్ సినిమా షూటింగులు జ‌ర‌క్కపోవ‌డంతో కూర‌గాయ‌లు అమ్ముకుంటూ క‌నిపించాడు. దీనికి సంబంధించిన వీడియోను టిక్‌టాక్‌లో వైర‌ల్ గా మారింది.

క‌రోనా క‌ష్టాలు..  కూర‌గాయ‌లు అమ్ముకుంటున్న న‌టుడు
Follow us on

క‌రోనా ప్రపంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. దీని ప్ర‌భావం స‌మాజంలోని అన్నీ రంగాల మీద ప్ర‌భావం చూపుతోంది. చాలా మంది ఉద్యోగాలు కొల్పోయారు. ముఖ్యంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేసే కార్మికుల‌కు, చిన్న‌, చిన్న న‌టుల క‌ష్టాలు వ‌ర్ణించ వీలు లేనివి. వారికి లాక్‌డౌన్ క‌ష్టాలు క‌డుపు కాలేలా చేస్తున్నాయి. తాజాగా యాక్ట‌ర్ జావేద్ హైద‌ర్ సినిమా షూటింగులు జ‌ర‌క్కపోవ‌డంతో కూర‌గాయ‌లు అమ్ముకుంటూ క‌నిపించాడు. దీనికి సంబంధించిన వీడియోను టిక్‌టాక్‌లో వైర‌ల్ గా మారింది.

దీనికి ల‌క్ష‌ల్లో లైకులు వ‌చ్చాయి. “ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితిలోనూ మాన‌సిక సంఘ‌ర్ష‌న‌కు లోన‌వ్వ‌కుండా..నూత‌న మార్గాన్ని ఎన్నుకుని జీవించ‌డం గ్రేట్”‌, “అత‌ని బ్ర‌త‌కడానికి ఏదో ఒక న్యాయ‌మైన‌ చేస్తున్నాడు. జీవితంలో ఎప్పుడూ ఆశ కొల్పోకూడ‌దు” అని టిక్‌టాక్ యూజ‌ర్లు కామెంట్స్ పెడుతున్నారు. కాగా జావేద్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెర‌పై అరంగేట్రం చేశాడు. అమీర్‌ఖాన్ ‘గులాం’, ‘లైఫ్ కీ ఐసీ కి తైసి’, ‘బాబ‌ర్’‌ సినిమాల్లో న‌టించాడు. వీటితోపాటు ‘జెన్నీ ఔర్ జుజు’ అనే టీవీ సిరీస్‌లో కూడా యాక్ట్ చేశాడు.