
టాలీవుడ్ నటుడు ఛత్రపతి శేఖర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సీరియల్స్, సినిమాల ద్వారా బుల్లితెరపై, వెండితెరపై తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమాలను ఆయన ఏదోక పాత్రలో కనిపిస్తుంటారు. వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందన్న సంగతి తెలిసిందే. రాజమౌళి తెరకెక్కించిన మొదటి సీరియల్ శాంతి నివాసంలో ఛత్రపతి శేఖర్ ముఖ్య పాత్ర పోషించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే సెట్ లో స్టార్ హీరోల ప్రవర్తన గురించి చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల బిహేవియర్ కూడా చాలా సాధారణంగా ఉంటుందని, వారితో పనిచేసినవారు ఈ విషయాన్ని చెబుతారని అన్నారు. సాధారణంగా పెద్ద స్టార్ హీరోలు షూటింగ్ విరామ సమయంలో క్యారవాన్‌కే పరిమితమవుతుంటారు. కానీ బాలకృష్ణ కేవలం షాట్‌కు సిద్ధమయ్యే వరకే క్యారవాన్‌లో ఉంటారని, ఆ తర్వాత బయటకు వచ్చి ఒక చెట్టు కింద కుర్చీ వేసుకుని కూర్చుంటారని శేఖర్ తెలిపారు. ఆ సమయంలో ఆయన ఖాళీగా ఉండకుండా ఏదైనా పుస్తకం చదవడం లేదా సినిమాకు సంబంధించిన పద్యాలు, గ్రాంధిక ప్రసంగాలు వింటూ ఉంటారని చెప్పారు. సెట్స్‌లో ఆయన ఎంతో సరదాగా ఉంటారని, ఎవరైనా కనిపిస్తే పిలిచి నాలుగు మంచి మాటలు మాట్లాడుతారని పేర్కొన్నారు. ఆయనకు మొదటి నుండి ఉన్న సమయపాలన, క్రమశిక్షణ (స్ట్రిక్ట్‌నెస్) చూసి కొందరు తప్పుగా అర్థం చేసుకుని నెగిటివ్ ప్రచారం చేస్తుండవచ్చని శేఖర్ అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Ananya Nagalla : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అలాంటి భర్త రావాలి.. హీరోయిన్ అనన్య నాగళ్ల..
బాలకృష్ణ సరళమైన మనస్తత్వానికి నిదర్శనంగా శేఖర్ ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. ‘విజయేంద్ర వర్మ’, ‘లెజెండ్’, ‘జైసింహా’ చిత్రాల తర్వాత శేఖర్ బాలయ్యతో కలిసి ‘అఖండ’ సినిమాలో నటించారు. షూటింగ్ సమయంలో శేఖర్ మేకప్, విగ్గు వేసుకుంటుండగా బాలకృష్ణ దూరం నుండి గమనించారు. అయితే బాలయ్య పద్యాల మూడ్‌లో ఉన్నారని భావించిన శేఖర్, ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని పలకరించడానికి వెళ్ళలేదు.
ఎక్కువ మంది చదివినవి : Chiranjeevi- Rajinikanth: రజినీకాంత్ హీరో.. చిరంజీవి విలన్.. కట్ చేస్తే.. అక్కడ బ్లాక్ బస్టర్..
కొద్దిసేపటికి శేఖర్ బాలకృష్ణ దగ్గరికి వెళ్లి నమస్కారం చేయగా, బాలయ్య ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అంతేకాదు, ఆ సమయంలో బాలకృష్ణకు ఎలాంటి షాట్ లేకపోయినప్పటికీ, శేఖర్ దగ్గరకు వచ్చి స్వయంగా ఆయన గడ్డం , విగ్గును సరిచేశారని చెప్పారు. ఒక అంతటి పెద్ద స్టార్ హీరో తన వద్దకు వచ్చి మేకప్ సరిచేయడం చూసి శేఖర్ మైండ్ బ్లాక్ అయిపోయిందని, ఆ క్షణంలో ఆయన చూపిన చొరవ తనను ఎంతగానో రిలాక్స్ చేసిందని శేఖర్ ఎమోషనల్ అయ్యారు.
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. తనతో చాలా సినిమాలు చేశా.. నయనతార కామెంట్స్..