Actor Arjun: లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరోకు క్లీన్ చిట్.. మూడేళ్ల తర్వాత అర్జున్‏కు ఊరట..

|

Dec 01, 2021 | 7:07 PM

సినీ పరిశ్రమలో మీటూ... క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో

Actor Arjun: లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరోకు క్లీన్ చిట్.. మూడేళ్ల తర్వాత అర్జున్‏కు ఊరట..
Arjun
Follow us on

సినీ పరిశ్రమలో మీటూ… క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తాము ఎదుర్కోన్న చేదు అనుభవాలను.. పరిస్థితులను నటీమణులు మీడియా ముందు బయటపెట్టారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా భాషతో సంబంధం లేకుండా హీరోయిన్స్ తమ పరిస్థితిని తెలియజేశారు. దీంతో పలువురు స్టార్ హీరోస్.. డైరెక్టర్స్, ప్రొడ్యుసర్స్ పేర్లు బయటకు వచ్చాయి. ఇక ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో లైంగిక వేదింపులు తగ్గాయి. తమకు ఎదురయ్యే చేదు పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నటీమణులు.

ఇదిలా ఉంటే.. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ లైంగిక వేధింపుల కేసులో క్లీన్ చీట్ అందుకున్నాడు. మూడు సంవత్సరాల క్రితం హీరోయిన్ శృతి హరి హరన్.. హీరో అర్జున్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలోనే ఆయన విచారణకు కూడా హాజరుకావాల్సి వచ్చింది. షూటింగ్ పేరుతో తనను కౌగిలించుకున్నాడని.. తన చేతులు లాగాడని ఆమె ఆరోపించింది. ఇక మూడు సంవత్సరాల అనంతం తాజాగా ఈ కేసులో సరైన సాక్ష్యాలు లేవంటూ పోలీసులు కేసును కొట్టి వేశారు. సరైన సాక్ష్యాలు లేకుండా శృతి.. అర్జున్ పై ఆరోపణలు చేసిందని పోలీసులు పేర్కోన్నారు. హీరో అర్జున్‏కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో అర్జున్ చిత్రాలు సూపర్ హిట్ అందుకున్నాయి.

Also Read: Megastar Chiranjeevi : వరద బాధితుల కోసం భారీగా విరాళాలు ప్రకటించిన చిరంజీవి.. మహేష్ బాబు..

Pushpaka Vimanam: ఓటీటీలో ఆనంద్ దేవరకొండ సినిమా.. ఆహాలో పుష్పక విమానం స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Viral Photo: ఈ చిరునవ్వుల చిన్నది ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్.. మన తెలుగమ్మాయి కూడా.. ఎవరో కనిపెట్టండి!

Radhe Shyam: అభిమానులకు షాకిచ్చిన రాధేశ్యామ్ టీం.. నగుమోము తారలే సాంగ్ వాయిదా.. ఎందుకంటే..