Bandla Ganesh: మంచి మనసు చాటుకున్న బండ్ల గణేశ్‌.. సాయం అడిగిన వెంటనే గూగుల్‌ పే నెంబర్‌ పంపమంటూ.

Bandla Ganesh: బండ్ల గణేశ్‌ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మనసులో ఏదున్నా ఎలాంటి దాపరికాలు లేకుండా బయటకు చెప్పే గణేశ్‌...

Bandla Ganesh: మంచి మనసు చాటుకున్న బండ్ల గణేశ్‌.. సాయం అడిగిన వెంటనే గూగుల్‌ పే నెంబర్‌ పంపమంటూ.
Bandla Ganesh Helping

Updated on: Jul 15, 2021 | 9:52 AM

Bandla Ganesh: బండ్ల గణేశ్‌ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మనసులో ఏదున్నా ఎలాంటి దాపరికాలు లేకుండా బయటకు చెప్పే గణేశ్‌ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తనను తాను పవన్‌ కళ్యాణ్‌కు భక్తుడని చెబుతుంటారు గణేశ్‌. ఇక తనపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కటువుగా స్పందించే బండ్ల గణేశ్‌ మనసు మాత్రం చాలా సున్నితం. తాజాగా ఓ విషయమై గణేశ్‌ స్పందించిన తీరే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు.


వివరాల్లోకి వెళితే.. తాజాగా బండ్ల లింగయ్య అనే వ్యక్తికి ప్రమాదం జరిగింది. బాగా గాయలపాలైన లింగయ్యకు వైద్యులు ఆపరేషన్‌ చేశారు. అసలే పేద కుటుంబం కావడంతో లింగయ్య ఆర్థికంగా చితికిపోయాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన లింగయ్య సోదరుడు.. బండ్ల గణేశ్‌కు ట్యాగ్ చేశాడు. ‘ నమస్కారం అన్న ఇతను మా అన్నయ్య బండ్ల లింగయ్య. ఇటీవల ఆటో ప్రమాదం జరిగింది ఆపరేషన్ చేశారు. డాక్టర్లు 48 కుట్లు వేశారు. ఆరు నెలలు ఇంట్లోనే ఉండమన్నారు. ఆర్ధికంగా చాలా ఇబ్బందిగా ఉంది ఎవ్వరు కూడా స్పందించట్లేదు. మీరైనా కొంచెం ఆదుకోండి గణేశ్‌ అన్న. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు’ అంటూ క్యాప్షన్‌తో పాటు లింగయ్య ఆస్పత్రి, అతని చిన్నారుల ఫొటోలను షేర్‌ చేశాడు. దీంతో ఈ ట్వీట్‌పై వెంటనే స్పందించిన బండ్ల గణేశ్‌.. ‘బండ్ల లింగయ్య ఫోన్‌ పే నెంబర్‌ను పంపించు’ అని రీ ట్వీట్‌ చేశారు. క్షణం కూడా ఆలోచించకుండా సాయం చేయడానికి ముందుకొచ్చిన గణేశ్‌ ఔదార్యాని చూసిన ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘నువ్వు సూపర్‌ అన్న’, ‘దేవుడు మీరు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:  RAPO 19 Movie : రామ్ సినిమాలో నదియా.. లుక్ రివీల్ చేసిన చిత్రయూనిట్.. ఆకట్టుకుంటున్న ఫోటో

Anushka Shetty : అనుష్క శెట్టి సినిమా ఆగిపోయిందా.. స్వీటీ మూవీ పై గుసగుసలు.. అసలు విషయం ఏంటంటే

Kudi Yedamaithe: కలలో ఏమి జరిగిందో.. ఎగ్జాక్ట్‌‌‌గా అదే జరుగుతోంది.. ఆకట్టుకుంటున్న కుడిఎడమైతే ట్రైలర్..