Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

సాధారణంగా స్టార్ హీరోహీరోయిన్స్ పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా తారల పిల్లలు.. వాళ్లు ఏం చదువుతున్నారు.. ఏం చేస్తున్నారు అనే విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. తాజాగా ఓ హీరోహీరోయిన్ల కూతురి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో మీరు గుర్తుపట్టారా.. ?

Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?
Ajith Daughter

Updated on: May 29, 2026 | 8:38 PM

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అజిత్ ముందుంటారు. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. ఇప్పటికీ బ్యాక్ టూబ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు అజిత్. అలాగే అటు షూటింగ్ నుంచి కాస్త సమయం దొరికితే బైక్ , కార్ రేసింగ్ చేస్తుంటారు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే హీరోయిన్ శాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఈ దంపతుల కుమార్తె అనౌష్క కుమార్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సాధారణంగా సెలబ్రిటీల పిల్లలు (స్టార్ కిడ్స్) నిరంతరం కెమెరాల వెలుతురులో, మీడియా కంటికి కనిపిస్తూ ఉంటారు. కానీ అనౌష్క మాత్రం లైమ్‌లైట్‌కు, మీడియా ఆర్భాటాలకు దూరంగా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటోంది. ఇటీవల ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, అనౌష్కలో వచ్చిన మేకోవర్ (మార్పు) చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.

తాజాగా అనౌష్క లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఆమె అచ్చం తన తల్లిలాగే ఎంతో అందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అనౌష్క కేవలం స్టార్ కిడ్ మాత్రమే కాదు, ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా. చిన్న వయసులోనే ఆమె తనలో దాగున్న విభిన్న ప్రతిభలను నిరూపించుకుంటోంది. ఆమెకు బేకింగ్ (కేకులు, పేస్ట్రీలు తయారు చేయడం) అంటే చాలా ఇష్టం. కేవలం హాబీగానే కాకుండా, ఆమె స్వయంగా బేక్ చేసిన అద్భుతమైన కేకుల ఫోటోలను పంచుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా ఒక పేజీని కూడా నిర్వహిస్తోంది. దీనికి వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. బేకింగ్‌తో పాటు క్రీడల్లోనూ అనౌష్క రాణిస్తోంది. స్కూల్ లెవెల్‌లో జరిగిన పలు జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో పాల్గొని తన ప్రతిభను చాటుకుంది.

ఎక్కువమంది చదివినవి : Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్..

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, అనౌష్క తన తండ్రి అజిత్ సినిమాలోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెరిసింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో 2015లో వచ్చిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఎన్నై అరిందాల్’ (తెలుగులో ‘ఎంతవాడు గానీ’) సినిమాలో ఆమె ఒక చిన్న అతిథి పాత్రలో కనిపించింది. అదే ఆమె మొదటి, చివరి వెండితెర సినిమా కూడా అదే. ఆ తర్వాత ఆమె పూర్తిగా చదువుపైనే శ్రద్ధ పెట్టింది. అజిత్ భార్య శాలిని అప్పుడప్పుడు షేర్ చేసే ఫ్యామిలీ ఫోటోల్లోనే అనౌష్క కనిపిస్తూ ఉంటుంది. తండ్రితో ఆమెకు ఉన్న అనుబంధం, ఎంతో పద్ధతిగా పెరిగిన ఆమె తీరు చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందం, తెలివితేటలు కలగలిసిన అనౌష్క భవిష్యత్తులో ఏ రంగాన్ని ఎంచుకున్నా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది..

అనౌష్క ఫోటో..

Ajith, Shalini

ఎక్కువమంది చదివినవి : Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‏లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి..

Follow Us