Aamir Khan: ‘అప్పుడు చాలా అవమానంగా అనిపించింది’.. కన్నీళ్లు పెట్టుకున్న అమీర్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో టాప్ 5లో ఒకరు అమీర్ ఖాన్. అక్కడ అమీర్ ఖాన్ అంటే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. విభిన్నమైన సినిమాలకు పెట్టింది పేరు అమీర్ ఖాన్.

Aamir Khan: 'అప్పుడు చాలా అవమానంగా అనిపించింది'.. కన్నీళ్లు పెట్టుకున్న అమీర్ ఖాన్
Aamir Khan
Follow us

|

Updated on: Aug 09, 2022 | 10:40 AM

బాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో టాప్ 5లో ఒకరు అమీర్ ఖాన్(Aamir Khan). అక్కడ అమీర్ ఖాన్ అంటే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. విభిన్నమైన సినిమాలకు పెట్టింది పేరు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ సినిమా అంటే చాలు అవలీలగా వందకోట్ల వసూల్ రాబడుతుందని నమ్మకం వ్యక్తం చేస్తుంటారు ప్రొడ్యూసర్లు. అలాగే తనదైన నటనతో సినిమాను రక్తికట్టించడంలో ఆయనకు ఆయనే సాటి. అమీర్ ఖాన్ చేసే ప్రయోగాలు మారే ఇతర హీరోలు చేయరంటే అతిశయోక్తికాదేమో.. సినిమా సినిమా గ్యాప్ తీసుకున్నా సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తారు అమీర్. అయితే అమీర్ ఖాన్ ఏమి అంత సులభంగా సూపర్ స్టార్ అవ్వలేదు.. ఆయన కూడా తన జీవితంలో ఎన్నో అవమానాలు, పేదరికం అనుభవించి వచ్చిన వారే.. తాజాగా తన స్కూల్ లైఫ్ గురించి.. అప్పటి చేదు అనుభవాల గురించి ఎమోషనల్ అయ్యారు అమీర్ ఖాన్.

ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన చిన్నతనంలో తన కుటుంబం ఆర్థిక సమస్యలు ఎదుర్కొందని అన్నారు. స్కూల్ డేస్ లో కనీసం ఫీజు కూడా కట్టలేని పరిస్థితి ఉండేదని.. ఆ సమయంలో ఫీజ్ కట్టని వారి పేర్లు చదువుతుంటే తాను చిన్నబుచ్చుకునేవాడినని అన్నారు అమీర్. తాను చదువుకునే రోజుల్లో తమ కుటుంబం తీవ్ర అప్పుల్లో ఉండి, ఎనిమిదేళ్ల పాటు గడ్డు పరిస్థితులను చూసినట్టు తెలిపారు అమీర్. స్కూల్ ప్రిన్సిపాల్ ఫీజ్ కట్టని వారి పేర్లు పెద్దగా చదివేవారు అని అప్పుడు చాలా అవమానంగా అనిపించేదని చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు అమీర్ ఖాన్. ఇక లాల్ సింగ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించగా.. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి