Allu Arjun: అల్లు అర్జున్‌- అట్లీ సినిమా పేరు ఇదేనా! టైటిల్ అద్దిరిపోయిందిగా!

పుష్ప 2 ది రూల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కంటెంట్ బయటకు రాకుండా మూవీ టీమ్ ఎంతో జాగ్రత్త పడుతోంది.

Allu Arjun: అల్లు అర్జున్‌- అట్లీ సినిమా పేరు ఇదేనా! టైటిల్ అద్దిరిపోయిందిగా!
Allu Arjun

Updated on: Apr 07, 2026 | 7:32 PM

పుష్ప 2తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను సరిచేశాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు తన విజయ పరంపరను కొనసాగించేందుకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సుమారు రూ.800 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. #AA22XA6 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కంటెంట్ బయటకు రాలేదు. కనీసం హీరో ఫస్ట్ లుక్ కానీ, టైటిల్ కానీ రివీల్ చేయలేదు. అయితే అల్లు అర్జున్ పుట్టిన రోజు (ఏప్రిల్ 08) సందర్భంగా బుధవారం అల్లు అర్జున్ కొత్త సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ మేరకు మంగళవారం చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఒక క్రేజీ అప్ డేట్ ఇచ్చింది. జంతువు పంజాతో ఉన్న పోస్టర్ ను షేర్ చేస్తూ ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈనేపథ్యంలో
అల్లు అర్జున్- అట్లీ సినిమా టైటిల్‌ గురించి సోషల్‌ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

అల్లు అర్జున్ 22వ సినిమాకు వైల్డ్‌ ఫైర్‌ అనే పేరు ఖారారు చేశారని సామాజిక మాధ్యమాల్లో తెగ ప్రచారం జరుగుతుంది.మొన్నటివరకు ‘లెగసీ’ అనే టైటిల్‌ పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇవి మాత్రమే కాకుండా ‘అయాన్‌’, ‘స్పార్క్‌’ అనే పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి. మరి ఇందులో ఏ టైటిల్ ఖరారు అవుతుందోనన్నది మరికొన్ని గంటల్లో తెలియనుంది.

ఇవి కూడా చదవండి

కాగా పునర్జన్మల కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సైన్స్‌ఫిక్షన్‌ చిత్రంలో అల్లు అర్జున్‌ మూడు విభిన్న పాత్రలు పోషించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. దీపికా పదుకొణెతో పాటు జాన్వీకపూర్, మృణాల్‌ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా ఈ సినిమాలో నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఈ విషయాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరికొన్ని గంటల్లో అల్లు అర్జున్ కొత్త సినిమా టైటిల్ రివీల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us