
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా పెద్ది. బుచ్చి బాబు సనా తెరకెక్కించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ నెల 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రామ్ చరణ్ సినిమాకు రూ. 292 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పెద్ది సినిమా పేరు ఇప్పుడు నెట్టింట తెగ మార్మోగుతోంది. అయితే ఈ మూవీ పేరుతో ఏకంగా స్కూల్ ఉంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో ఓ చిన్నారి ‘ది పెద్ది స్కూల్’ ను చూపించి.. ‘నాన్న.. అది చికిరి చికిరి వాళ్ల స్కూలా అంటూ క్యూట్‌గా.. అమాయకంగా అడిగింది’. ఈ క్యూట్ వీడియోను పెద్ది టీమ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో అమెరికాలో తీసినట్లుగా తెలుస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా సంయుక్తంగా పెద్ది సినిమాను నిర్మించారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గౌర్నాయుడు పాత్రలో ఆకట్టుకున్నారు. జగపతిబాబు, దివ్యేందు త్రిపాఠి, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, కమెడియన్ సత్య, చమ్మక్ చంద్ర, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి స్వరాలు అందించారు.
#ChikiriChikiri Vala School Ah Anta 🔥😂#PEDDI @AlwaysRamCharan pic.twitter.com/LDYLZLZTXQ
— SAI CHARANISM ™ 🔥 (@saicharanism1) June 8, 2026
Inka em cheptaam andi 🙏
Movie aipoii end credits padda tarvata kuda chustunnaru ante 🙏❤️
Nuv hit kodithe whole telugu states pandagala celebrate cheskuntar anna @AlwaysRamCharan ❤️🥹
SHER – E – ANDHRA 🔥#peddi pic.twitter.com/moAarhBJE3
— Trollex GC™ (@Trollex_1) June 8, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి