పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సినిమా పై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రభాస్ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. సాహో సినిమా దగ్గర నుంచి వరుసగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఇప్పుడు సలార్ సినిమా పై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ మూవీని డిసెంబర్ 22 న సినిమా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ తరహాలోనే సలార్ కూడా రెండు భాగాలుగా తీసుకురానున్నారు.
కేజీఎఫ్ 2 సినిమాలా సలార్ లెట్ గా వస్తుందని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ సలార్ 2 మాత్రం త్వరగానే ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తోంది. హాయ్ ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఇంతకు ఆ క్రేజీ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలైట్ గా ఉండనున్నాయి. సలార్ యాక్షన్ సీన్స్ కోసం ఏకంగా 750 వాహనాలను ఉపయోగించారట. జీపులు, ట్యాంకులు, ట్రక్కులు సహా 750కి పైగా వాహనాలను ఈ మూవీ యాక్షన్ సీన్స్ కోసం వాడారని తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ షూటింగ్ కోసం 750కి పైగా వాహనాలు వాడమని చిత్రయూనిట్ కన్నడ మీడియాతో పంచుకుంది. ఇప్పుడు ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక సలార్ సినిమాకు కేజీఎఫ్ సినిమాకు లింక్ ఉంటుందని అభిమానులు ఎక్స్పెట్ చేస్తున్నారు. దీన్ని పై ఇంతవరకు చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వలేదు.
#50DaysToSalaarCeaseFire 🔥 pic.twitter.com/J098BAqWAf
— Salaar (@SalaarTheSaga) November 2, 2023
Happy birthday to the sweetest , most humble person I know …. But come December 22nd this just might change …. #Prabhas #Salaar pic.twitter.com/UKwMYDQLCX
— Sriya Reddy (@sriyareddy) October 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.