2020 : విజయ్ కెరీర్‌లో జీరో ఇయర్‌ !

|

Oct 08, 2020 | 11:42 AM

మనకు ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాగో, తమిళనాట ఇలయదళపతి విజయ్ అలాగ. భారీ మాస్ ఫాలోయింగ్‌తో కోలివుడ్‌లో సత్తా చాటుతున్నాడు విజయ్.

2020 : విజయ్ కెరీర్‌లో జీరో ఇయర్‌ !
Follow us on

మనకు ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాగో, తమిళనాట ఇలయదళపతి విజయ్ అలాగ. భారీ మాస్ ఫాలోయింగ్‌తో కోలివుడ్‌లో సత్తా చాటుతున్నాడు విజయ్. ఈ  క్రేజీ హీరో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 27 సంవత్సరాలు అవుతుంది. ఈ 27 ఏళ్లలో, ప్రతి ఏటా  రెండు లేదా మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. కోవిడ్ ప్రభావంతో ఈ ఏడాది విజయ్ నటించిన  ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితేే అక్టోబర్ 15 నుంచి యేటర్స్ తెరచుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడంతో, విజయ్ నటించిన తాజా చిత్రం ‘మాస్టర్’ని దీపావళి కానుకగా రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఆశపడ్డారు. అయితే చిత్ర నిర్మాతలు ఈ ఏడాది విడుదల కష్టమే అనే సరికి తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు.

దీంతో 27 ఏళ్ల విజయ్ కెరీర్‌లో 2020 జీరో ఇయర్‌గా మారుతుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఇటీవలి కాలంలో ఈ మాస్ హీరోకి ఒక్క భారీ హిట్ కూడా పడలేదు. ఈ క్రమంలో మాస్టర్ చిత్రం రికార్డులు తిరగరాయాలని అభిమానులు కోరుకుంటున్నారు.  ( మెహబూబ్ ఘాటు వ్యాఖ్యలు, ఇచ్చి పడేసిన అఖిల్ )