టాలీవుడ్ లోప్రముఖ నిర్మాత ఇంట్లో విషాదం.. అనారోగ్యంతో కన్నుమూసిన బన్నీవాసు సోదరుడు

టాలీవుడ్ లోప్రముఖ నిర్మాత ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. బన్నీ వాసు సోదరుడు గవర సురేష్‌ అనారోగ్యంతో కన్నుమూశారు.

టాలీవుడ్ లోప్రముఖ నిర్మాత ఇంట్లో విషాదం.. అనారోగ్యంతో కన్నుమూసిన బన్నీవాసు సోదరుడు

Updated on: Dec 12, 2020 | 10:01 AM

టాలీవుడ్ లోప్రముఖ నిర్మాత ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. బన్నీ వాసు సోదరుడు గవర సురేష్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా సురేష్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీలు ఫెయిలవ్వడంతో బెంగుళూరులోని ప్రైవేటు ఆసుప్రతిలో సురేష్ చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ.. శుక్రవారం రాత్రి ఆయన కన్నుమూసారు. సురేష్‌కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. సురేష్ ఇంజనీరింగ్ చదివి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబందించిన ఇంజనీర్లలో టాప్ 4లో ఒకరుగా ఉన్నారు. సురేష్ అకాల మరణంతో బన్నీవాసు ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినీప్రముఖులు బన్నీవాసుని ఫోన్ ద్వారా పరామర్శిస్తున్నారు.