Rajeev Rayala |
Mar 28, 2021 | 3:09 PM
సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం .. ఎన్నోనో వర్ణాలు నిండిన సినిమా ఇండస్ట్రీ హోలీ మరింత అందాలను తెస్తుంది. ఆకాశంలో తారల్లా మెరిసే ముద్దుగుమ్మలు రంగుల్లో మునిగితే ఎలా ఉంటారు ఒక్కసారి చూద్దాం..
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇద్దరమ్మాయిలతో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ముద్దుగుమ్మ క్యాథరిన్. ఈ అమ్మడు రంగుల్లో సీతాకోక చిలకలా కవ్విస్తుంది.
లేడీ సూపర్ స్టార్ గా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయనతార. తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది.
ఉయ్యాలైన జంపాలైన సినిమాతో వెండితెరపై మెరిసిన వయ్యారి అవికాగోర్ . ఈ అమ్మడు ఆ మధ్య వరుస సినిమాలతో పలకరించింది. ఇప్పుడు కాస్త జోరు తగ్గించింది.
అందాల చందమామ కాజల్ అందం అభినయంతో ఆకట్టుకునే ఈ చిన్నది తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
మిల్కీ బ్యూటీ తమన్నా వెండి తెరపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులుండవు.. అమ్మడి అందం అలాంటిది మరి.
యాంకర్ గా అటు బుల్లితెరపైన యాక్టర్ గా ఇటు వెండి తెరపైన సందడి చేస్తుంది శ్రీముఖి