
ఎల్లలు దాటిన తన ఆలోచనలతో దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా సినిమాకు నిర్వచనం చెప్పిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. 94 ఏళ్ల వయసులో సింగ్ గీతం సినిమాతో అసలు సంభాషణ లేకుండా కేవలం సంగీతం ద్వారానే వెండితెరపై మరో ప్రయోగం చేశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సింగీతం శ్రీనివాసరావు.. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కేవీరెడ్డి కాలంలో సినీ ప్రస్థానం మొదలెట్టిన సింగీతం శ్రీనివాసరావు… ఇటీవల 94ఏళ్ల వయసులోనూ మెగాఫోన్ పట్టుకుని సినిమా పట్ల తన మక్కువ చాటిచెప్పారు. చివరిదాకా వినూత్న ఆలోచనలకే కేంద్రంగా బతికిన దర్శక దిగ్గజం… దివికి ఎగిసింది. ఇన్నాళ్లు అనేక ప్రయోగాలతో వెండితెరపై అద్భుతం సృష్టించిన ఆయన ఇక సెలవంటూ అనంత లోకాలకు వెళ్లిపోయారు.
సింగీతం శ్రీనివాస రావు మరణంపై నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన మా కుటుంబానికి చాలా సన్నిహితులు. మేమిద్దరం కలిసి మూడు విభిన్నమైన క్లాసిక్ చిత్రాలను అందించాము. తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకే ఒక కొత్త ముద్ర వేసిన ‘ఆదిత్య 369’; తెలుగులో మొట్టమొదటి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆధారిత చిత్రమై, బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించి, జానపద చిత్రాలలో ఇప్పటికీ తిరుగులేనిదిగా నిలిచిన ‘భైరవ ద్వీపం’; పౌరాణిక చిత్రం ‘శ్రీ కృష్ణార్జున విజయం’. ఈ మూడు చిత్రాల ద్వారా, ఒకే దర్శకుడి సారథ్యంలో నేను సాంఘిక, చారిత్రక, జానపద, పౌరాణిక అనే నాలుగు ప్రధాన జానర్‌లలోని పాత్రలను పోషించాను. ఆ జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మరచిపోలేను. మా నాన్నగారు తొలిసారిగా శ్రీకృష్ణుడి పాత్ర పోషించిన చిరస్మరణీయ చిత్రం ‘మాయాబజార్’ కోసం గొప్ప దర్శకుడు కె.వి. రెడ్డి గారి వద్ద సింగీతం గారు సహాయకుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత, ఆయన మా నాన్నగారి అనేక చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేశారు. అందువల్ల, మా కుటుంబానికి ఆయనతో సినిమా రంగానికి అతీతమైన ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడింది.
సింగీతం గారు అన్ని విధాలా అసలు సిసలు దిగ్గజ దర్శకుడు. ఆయన 94 ఏళ్ల వయసులో తన చివరి శ్వాస వరకు వివిధ భారతీయ భాషలలో మరపురాని సినిమా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు, భారతీయ చిత్ర పరిశ్రమకు పూడ్చలేని నష్టం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సింగీతం గారి కుటుంబ సభ్యులకు మా నందమూరి కుటుంబం పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని అన్నారు.
సింగీతం శ్రీనివాసరావు మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. “ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ సింగీతం శ్రీనివాస రావు గారి మృతి అత్యంత బాధాకరం. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించిన ఆయన సినీ పరిశ్రమకు దిక్సూచిగా మారారు. వెండి తెరపై ఆయన చేసిన ప్రయోగాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. సింగీతం గారు భౌతికంగా దూరమైనా సినీ ప్రేమికుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అంటూ ట్వీట్ చేశారు.
ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ సింగీతం శ్రీనివాస రావు గారి మృతి అత్యంత బాధాకరం. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించిన ఆయన సినీ పరిశ్రమకు దిక్సూచిగా మారారు. వెండి తెరపై ఆయన చేసిన ప్రయోగాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. సింగీతం గారు భౌతికంగా దూరమైనా సినీ ప్రేమికుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
— N Chandrababu Naidu (@ncbn) October 4, 2026
డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్..
శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి
ప్రముఖ దర్శకులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు కన్ను మూశారని తెలిసి విచారిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. భారతీయ చలన చిత్రపరిశ్రమలో విభిన్న చిత్రాలు రూపొందించారు. పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మయూరి, ఆదిత్య 369, మైకేల్ మదన కామరాజు లాంటి చిత్రాల్లో శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు చేసిన ప్రయోగాలు, చూపిన సృజన ప్రేక్షకులను మెప్పించాయి. ఆయన రూపొందించిన అమెరికా అమ్మాయి, పంతులమ్మ లాంటి చిత్రాల్లోని గీతాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 94 ఏళ్ల వయసులోనూ సింగ్ గీతం అనే చిత్రానికి దర్శకత్వం వహించడం ఆయనకి సినిమా పట్ల ఉన్న ఆసక్తిని తెలియచేసింది. శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
– @PawanKalyan
@PIB_India @IPR_AP @pibvijayawada
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) October 4, 2026
సినీరంగంలో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు చిత్రపరిశ్రమకు, భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.
వైవిధ్యమైన కథాంశాలను, వినూత్నమైన ఆలోచనలను తెరపై ఆవిష్కరిస్తూ తెలుగు సినిమాకు కొత్త దారులు చూపిన సృజనాత్మక దర్శకుడని స్మరించుకున్నారు. ప్రయోగాత్మకతకు పెద్దపీట వేస్తూ ఎన్నో చిరస్మరణీయ చిత్రాలను అందించిన సింగీతం శ్రీనివాసరావు గారు తనదైన ముద్రను సినీ చరిత్రలో శాశ్వతంగా వేశారని అన్నారు.
దర్శకుడిగానే కాకుండా రచయితగా, ఆలోచనాపరుడిగా, సినిమా పట్ల అపారమైన ప్రేమతో పనిచేసిన కళాకారుడిగా ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. సింగీతం శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ కళాభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
#SingeethamSrinivasaRao— Telangana CMO (@TelanganaCMO) October 4, 2026
దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన దర్శక దిగ్గజం శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. వారి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించి, నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాను. నాకు వ్యక్తిగతంగా ఆత్మీయులైన శ్రీ సింగీతం గారు ఉదయగిరిలోనే జన్మించారు. ఆ పరంగానూ మా ఇద్దరి మధ్య పరిచయం ఆత్మీయతగా మారింది. వారు నా పట్ల చూపించి గౌరవం, అభిమానం మరువలేనివి.
శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి లాంటి వ్యక్తులు చాలా అరుదు. సినిమా రంగంలో వారి ప్రతి అడుగు విలక్షణమైనది. ప్రేక్షకుల నాడిని పట్టుకోవడమే కాదు, కాలం కంటే ఒక అడుగు ముందే ఆలోచించి దాదాపు 4 తరాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారాయన. వయసు అనేది కేవలం అంకెలు మాత్రమే అని, మనసుతో పాటు ఆలోచనలు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని సంతరించుకోవాలన్న పెద్దల మాటలకు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు.
ఒక సినిమా దర్శకుడిగానే గాక, సినిమా ప్రయోగశాలగా వారి ప్రస్థానం యువతరానికి స్ఫూర్తిదాయకమైనది. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి, మారుతున్న కాలానికి అనుగుణంగా మంచి సినిమా ఎలా తీయాలి, మూసలో కొట్టుకుపోకుండా మనదైన ముద్ర ఎలా వేయాలి అన్న అనేక అంశాలకు వారు ఆదర్శంగా నిలుస్తారు. కేవలం సినిమాకే కాదు, ప్రతి రంగానికి వారి ప్రస్థానం ప్రేరణను అందిస్తుంది. శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి స్ఫూర్తిని యువతరం అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) October 4, 2026
Deeply saddened by the passing of the legendary filmmaker ‘Singeetam Srinivasa Rao’ garu.
A true visionary, his imagination and courage to explore new ideas gave Indian cinema some of its most unforgettable films. His contribution to cinema will always be remembered with immense respect and affection.
His recent film ‘Sing Geetham’ was a beautiful testament to his undying passion for storytelling. At heart, he remained forever young, curious and eager to create.
My heartfelt condolences to his family and loved ones.
We will miss you, Singeetam garu. Your films will continue to speak to generations.
Om Shanti 🙏— Chiranjeevi Konidela (@KChiruTweets) October 4, 2026
Dearest SINGEETAM SIR..
We wil MISS YOU Sir..You will always live in our Hearts ❤️
You are an Unparalleled LEGEND..
An Everest of Positivity filled with Evergreen Youth..The Movies You made with such Fururistic Ideas and Techniques are lessons to all of us and the Future Generations of Film Makers too 🙏🏻❤️
Thankyou & Love You for Everything Sir..
Iam blessed to have known You & worked with You Sir 🙏🏻#SingeetamSrinivasRaoLivesOn
— DEVI SRI PRASAD (@ThisIsDSP) October 3, 2026
Indian cinema has lost a true pioneer and pathbreaker, who continued making movies even at the age of 94. Singeetham Srinivasa Rao garu’s unmatched creativity, from silent marvels to sci-fi epics, inspires generations. Heartfelt condolences to his family and loved ones. May he rest in peace!
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 4, 2026
ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. ప్రయోగాత్మక చిత్రాలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ఆయన మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. మా తాతయ్య ఎన్టీఆర్ గారు, బాలా మామయ్యలతో కలిసి పనిచేసిన సింగీతం గారు అనేక అద్భుతమైన చిత్రాలను అందించారు. బాలా మామయ్య కెరీర్లోనే ఆణిముత్యాల్లాంటి ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 95 ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ చిత్రాన్ని తెరకెక్కించి రికార్డు సృష్టించిన బహుముఖ ప్రతిభాశాలి సింగీతం శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
— Lokesh Nara (@naralokesh) October 4, 2026
Singeetham sir ❤️
Your beliefs, your thoughts and your stories will live on with us forever.For everytime you called me since Pellichoopulu to shower love and effection, i hope it made you happy and brought a smile seeing me in one of your films – Sing Geetham ❤️
I feel happy to have been a part of one of your vision.
My forever respect ❤️
— Vijay Deverakonda (@TheDeverakonda) October 4, 2026
A giant of Indian cinema is no more…. Singeetam Srinivasa Rao garu was a legend in every sense of the word.. A filmmaker of extraordinary imagination, courage and brilliance.. Indian cinema will forever be indebted to him.. Rest in peace sir.. My deepest condolences to his family…
— Mahesh Babu (@urstrulyMahesh) October 4, 2026
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‌తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..