Viral Photo: హాలీవుడ్‌ హీరోను తలదన్నేలా టాలీవుడ్‌ కుర్ర హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?

Viral Photo: నిత్యం సినిమాలతో బిజీగా ఉండే సినీ తారలు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా రెక్కలు కట్టుకొని విదేశాల్లో వాలిపోతుంటారు. గజిబిజీ లైఫ్‌ను నుంచి కాస్త బ్రేక్‌ తీసుకొని అలా అలా విహరిస్తుంటారు....

Viral Photo: హాలీవుడ్‌ హీరోను తలదన్నేలా టాలీవుడ్‌ కుర్ర హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?

Updated on: Jul 07, 2022 | 5:27 PM

Viral Photo: నిత్యం సినిమాలతో బిజీగా ఉండే సినీ తారలు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా రెక్కలు కట్టుకొని విదేశాల్లో వాలిపోతుంటారు. గజిబిజీ లైఫ్‌ను నుంచి కాస్త బ్రేక్‌ తీసుకొని అలా అలా విహరిస్తుంటారు. ప్రస్తుతం ఓ టాలీవుడ్‌ కుర్ర హీరో అలాంటి వెకేషన్‌ మూడ్‌లోనే ఉన్నాడు. సినిమా షూటింగ్‌లో దొరిక గ్యాప్‌లో తెగ ఎంజాయ్‌ చేస్తున్నాడు. స్విట్జర్లాండ్‌లోని మంచు కొండల్లో హల్చల్‌ చేస్తున్నాడీ కుర్ర హీరో. ప్రస్తుతం ఆఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

పైన కనిపిస్తోన్న ఫొటోలో అచ్చంగా హాలీవుడ్‌ హీరోను పోలినట్లు ఉన్న కుర్ర హీరో ఎవరో గుర్తుపట్టారా.? బాల నటుడిగా కెరీర్‌ మొదలు పెట్టిన ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడిగా మారాడు. కుటుంబం పరంగా సినీ వారసత్వం ఉన్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలే ఓ సినిమాతో విజయాన్ని చవిచూసిన ఈ హీరో ఇప్పుడు ఇంటర్నేషనల్‌ ఏజెంట్ పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం తన బాడీని పూర్తిగా మార్చేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ యంగ్‌ హీరో ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.? ఇతను మరెవరో కాదండోయ్‌… అక్కినేని నట వారసుడు అఖిల్‌. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ సినిమాతో హిట్‌ అందుకున్న అఖిల్‌ ప్రస్తుతం ఏజెంట్‌ సినిమాలో నటిస్తున్నాడు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌లో బ్రేక్‌ దొరకడంతో అఖిల్‌ ఇలా ఎంజాయ్‌ చేస్తున్నాడు. టూర్‌కి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నాడు. దీంతో ఈ ఫొటోలు కాస్త నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..